హీరోయిన్‌తో అసభ్య ప్రవర్తన.. డైరెక్ట్‌గా ఆ మాట అడిగేయడంతో.. ఇష్యూ హాట్ టాపిక్

సోషల్ మీడియా బాగా విస్తరించడంతో సెలబ్రిటీలకు, సాధారణ ప్రజలకు మధ్యదూరం క్రమంగా తగ్గిపోతోంది. హీరోహీరోయిన్స్ సామాజిక మాధ్యమాల వేదికగా నేరుగా ప్రేక్షకులతో ముచ్చటిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని అనుకోని సంఘటనలు సెలబ్రిటీలను ఇబ్బంది పెడుతున్నాయి. అలాంటి ఓ సంఘటనే ఎదురైంది మలయాళీ హీరోయిన్ సంయుక్త మీనన్‌కు. వివరాల్లోకి పోతే..

సెల్ఫ్ ప్రమోషన్.. అభిమానులతో ముచ్చట్లు

సెల్ఫ్ ప్రమోషన్.. అభిమానులతో ముచ్చట్లు

ఈ రోజుల్లో నటీనటులు సెల్ఫ్ ప్రమోషన్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. అందుకే సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ టచ్ లో ఉంటూ ప్రేక్షకులతో ముచ్చటిస్తున్నారు. అంతేకాదు ఎప్పటికప్పుడు తమ ఫోటోలు షేర్ చేస్తూ హాట్ టాపిక్ అవుతున్నారు. ఇదే కొందరు ఆకతాయిలు ఆసరాగా మారింది.

సంయుక్త మీనన్‌ తో నెటిజన్ అసభ్య ప్రవర్తన

సంయుక్త మీనన్‌ తో నెటిజన్ అసభ్య ప్రవర్తన

ముఖ్యంగా హీరోయిన్లను లక్ష్యంగా చేసుకుని కొందరు ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. తాజాగా ఓ మలయాళీ హీరోయిన్‌ సంయుక్త మీనన్‌ తో అసభ్యంగా ప్రవర్తించాడు ఓ నెటిజన్. సభ్యత లేకుండా అందరి ముందు ఆ హీరోయిన్‌ను నువ్వు వర్జినా? కాదా? అని ప్రశ్నించాడు. ఒక్కసారిగా షాక్ అయిన ఆమె అతనికి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది.

నీ లాంటి వల్లే ఈ పరిస్థితి.. హీరోయిన్ ఫైర్

నీ లాంటి వల్లే ఈ పరిస్థితి.. హీరోయిన్ ఫైర్

మిస్టర్.. నీలాంటి వాళ్ళకు అమ్మాయిలు కేవలం ఆటబొమ్మలా కనిపిస్తారు.. నీలాంటి కొందరు ఆకతాయిలు వర్జినిటీ, సెక్స్, ఆల్కహాల్ గురించి ఎక్కువగా ఆలోచిస్తుండడం వల్లే ప్రస్తుతం అమ్మాయిలు భయాందోళనకు గురవుతున్నారు. అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అయింది సంయుక్త.

జాగ్రత్తగా ఉండు అంటూ వార్నింగ్

జాగ్రత్తగా ఉండు అంటూ వార్నింగ్

నీకు గాని కేవలం ఇలాంటివి ఇష్టమైతే కచ్చితంగా నీలో ఒక సమస్య ఉన్నట్లే అంటూ చెడా మడా తిట్టింది. ఇలాంటి కామెంట్స్‌కు మహిళలు చెంప చెళ్లుమనిపించడం ఇంకా మొదలుపెట్టలేదు. కానీ జాగ్రత్తగా ఉండు.. నీ చెంప...పగలగొట్టే అమ్మాయి ఎక్కడో ఉండే ఉంటుంది అని గట్టి వార్నింగ్ ఇచ్చింది సంయుక్త.

Recommended Video

Mammootty's Mamangam Team Interview Part - 2
వరుస అవకాశాలతో బిజీ బిజీ

వరుస అవకాశాలతో బిజీ బిజీ

మలయాళ సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సంయుక్త మీనన్‌ 2016లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకొని.. ప్రస్తుతం అక్కడ వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. తమిళనాట కూడా సత్తా ఆమె హవా కొనసాగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X