twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దెయ్యాన్ని నమ్మి సినిమా ‘ఉసురు’ తీశారట!

    By Bojja Kumar
    |

    ఆర్.వి.జి.మూవీస్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం 'ఉసురు'. రుద్రాభట్ల వేణుగోపాల్, ఏపూరి సత్యనారాయణ నిర్మాతలు. వేణు.ఆర్. దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమా ఓ దెయ్యాన్ని నమ్మి తీశారట. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. ఆ విశాషాల గురించి దర్శకుడు మాట్లాడుతూ...''దెయ్యాన్ని నమ్మి సినిమా చేశాం, నా కథకి దెయ్యమే హీరో. ఓ ప్రేమ జంటచనిపోతే తర్వాత పరిస్థితి ఏమిటి? వారి ఆత్మలు ఎలా ఘోషిస్తాయి అనేది కథాం. "ఎవరి ఉసురు ఎవరికి తగిలింది? శిక్ష-నేరం తరహా కాన్సెప్ట్ ఇది"" అన్నారు.

    సినిమా చిత్రీకరణ వివరాలు వెల్లడిస్తూ....''మామూలుగా పాటలకు ముందుగా రికార్డింగ్ చేసి నృత్యాలను కంపోజ్ చేస్తారు. మేం ఈ సినిమా రీరికార్డింగ్ ముందు చేసి తర్వాత ప్రతి సీనునూ కంపోజ్ చేసుకున్నాం. కెమెరా పనితనం ప్రత్యేకంగా ఉంటుంది. ప్రతి ఫ్రేమూ పెయింటింగ్‌లా కనిపిస్తుంది. చాలా రిమోట్ ఏరియాలో దెయ్యం నిజంగానే ఉందా? అనే అట్మాస్పియర్ క్రియేట్ చేశాం. యథార్ధ సంఘటన ఆధారంగా తెరకెక్కించాం"" అన్నారు.

    మాధవీలత, సుభాష్ రాయల్, అభినయ కీలక పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: రవికుమార్ నీర్ల, మాటలు: జయచంద్రుని రవికుమార్, కూర్పు: అనిల్ కుమార్ బొంతు, సౌండ్ ఎఫెక్ట్స్: సాగర్, వీఎఫ్ఎక్స్: రామానంద్.

    English summary
    Vusuru movie Trailer released. This movie directed by Venu, produced by Venugopal and Satyanarayana.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X