Don't Miss!
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- News జగన్ కు వైఎస్ వివేకా భార్య లేఖ-అవినాష్, వైసీపీ అటాక్ పై-న్యాయంవైపు నిలబడాలని విన్నపం..!
- Sports టీ20 వరల్డ్ కప్‌లో ధోనీ రీఎంట్రీ: బీసీసీఐ మాస్టర్ ప్లాన్!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచి కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్‌తో నాయిస్ స్మార్ట్‌వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్‌తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
దెయ్యాన్ని నమ్మి సినిమా ‘ఉసురు’ తీశారట!
ఆర్.వి.జి.మూవీస్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం 'ఉసురు'. రుద్రాభట్ల వేణుగోపాల్, ఏపూరి సత్యనారాయణ నిర్మాతలు. వేణు.ఆర్. దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమా ఓ దెయ్యాన్ని నమ్మి తీశారట. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. ఆ విశాషాల గురించి దర్శకుడు మాట్లాడుతూ...''దెయ్యాన్ని నమ్మి సినిమా చేశాం, నా కథకి దెయ్యమే హీరో. ఓ ప్రేమ జంటచనిపోతే తర్వాత పరిస్థితి ఏమిటి? వారి ఆత్మలు ఎలా ఘోషిస్తాయి అనేది కథాం. "ఎవరి ఉసురు ఎవరికి తగిలింది? శిక్ష-నేరం తరహా కాన్సెప్ట్ ఇది"" అన్నారు.
సినిమా చిత్రీకరణ వివరాలు వెల్లడిస్తూ....''మామూలుగా పాటలకు ముందుగా రికార్డింగ్ చేసి నృత్యాలను కంపోజ్ చేస్తారు. మేం ఈ సినిమా రీరికార్డింగ్ ముందు చేసి తర్వాత ప్రతి సీనునూ కంపోజ్ చేసుకున్నాం. కెమెరా పనితనం ప్రత్యేకంగా ఉంటుంది. ప్రతి ఫ్రేమూ పెయింటింగ్‌లా కనిపిస్తుంది. చాలా రిమోట్ ఏరియాలో దెయ్యం నిజంగానే ఉందా? అనే అట్మాస్పియర్ క్రియేట్ చేశాం. యథార్ధ సంఘటన ఆధారంగా తెరకెక్కించాం"" అన్నారు.
మాధవీలత, సుభాష్ రాయల్, అభినయ కీలక పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: రవికుమార్ నీర్ల, మాటలు: జయచంద్రుని రవికుమార్, కూర్పు: అనిల్ కుమార్ బొంతు, సౌండ్ ఎఫెక్ట్స్: సాగర్, వీఎఫ్ఎక్స్: రామానంద్.