చిరు 150 సినిమా ఆలస్యంపై వివి వినాయక్..

ఈ విషయమై వినాయక్ మాట్లాడుతూ...చిరంజీవి 150వ చిత్రాన్ని నేనే హ్యాండిల్ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అయితే సరైన కథ దొరకక పోవడం వల్లనే సినిమా ప్రారంభం కాకుండా ఆలస్యం అవుతూ వస్తోందని వినాయక్ చెబుతున్నారు. చిరంజీవి ఆ మధ్య లండన్ టూర్లో కూడా మంచి కథ కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పిన విషయం తెలిసిందే.
వినాయక్ ఈ చిత్రాన్ని చిరంజీవి ఇమేజ్‌కు తగిన విధంగా ఆయన పొలిటికల్ కెరీర్‌కి తగిన విధంగటా భారీ బడ్జెతో రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నారు. రామ్ చరణ్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్నారు. కథ ఓకే అయిన తర్వాత హీరోయిన్ ఎవరు? అనే విషయం వెల్లడి కానుంది.
ప్రస్తుతం వినాయక్ రామ్ చరణ్ తేజ్‌తో ఓ సినిమా చేస్తూ బిజీ బిజీగా గుడపుతున్నాడు. ప్రస్తుతం ఈచిత్రం షూటింగ్ కోల్‌కతాలో జరుగుతోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. చరణ్ సరసన కాజల్, అమలపల్ నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











