twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రెండు విభిన్నమైన కోణాల్లో 'నాయక్‌' : వివి వినాయిక్

    By Srikanya
    |

    హైదరాబాద్ : ''నాయకత్వ లక్షణాలు పుణికి పుచ్చుకొన్న ఓ యువకుడి కథ ఇది. చరణ్‌ పాత్ర రెండు విభిన్నమైన కోణాల్లో సాగుతుంది. చరణ్‌ నృత్యాలు, అతనిపై చిత్రీకరించిన ఫైట్స్ మాస్‌ని అలరిస్తాయి. 'శుభలేఖ రాసుకొన్నా...' గీతాన్ని రీమిక్స్‌ చేశాం. ఆ పాటలోని లొకేషన్లు అబ్బురపరుస్తాయి. తమన్‌ మంచి బాణీలను అందించారు. జనవరి 9న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము'' అని దర్శకుడు వివి వినాయిక్ చెప్పారు.

    రామ్‌చరణ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'నాయక్‌'. కాజల్‌, అమలాపాల్‌ హీరోయిన్స్. వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. డి.వి.వి.దానయ్య నిర్మాత. ప్రస్తుతం కోల్‌కతాలో షూటింగ్ జరుగుతోంది. రామ్‌చరణ్‌, దేవ్‌గిల్‌, కిషోర్‌ రోయా, రాజీవ్‌ కనకాల తదితరులపై ఫైట్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. దాంతో పాటు కొన్ని కీలకమైన సన్నివేశాలనూ చిత్రీకరిస్తారు. ''సంఘ విద్రోహులకు ఎదురు తిరిగే యువకుడిగా చరణ్‌ పాత్ర ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ అలరించేలా ఆ పాత్రను తీర్చిదిద్దారు. వినాయక్‌ శైలిలో మాస్‌, యాక్షన్‌ అంశాల్ని మేళవించారు. సంక్రాంతికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము'' అని నిర్మాత డి.వి.వి.దానయ్య తెలిపారు.

    ఈ పాత్ర గురంచి రచయిత ఆకుల శివ మాట్లాడుతూ.. ''సందేశాన్ని కూడా వినోదం మేళవించి చెప్పినప్పుడే రక్తికడుతుంది. అదీ జనాదరణ ఉన్న హీరోతో చెప్పిస్తే ఎక్కువమందికి చేరుతుంది. చిరంజీవి రక్తదానం గురించి చెప్పారు కాబట్టే అవగాహన ఏర్పడింది. కాబట్టి మనం ప్రేక్షకులకు మంచి విషయం చెప్పాలనుకొన్నప్పుడు ఓ స్టార్‌ ద్వారా అతని ఇమేజ్‌కి తగ్గ కథలో మేళవించి చెప్పాలి. ఎక్కడా వాణిజ్య విలువలు వదులుకోకూడదు. ఇప్పుడు రామ్‌చరణ్‌ చిత్రంలో అంతర్లీనంగా కొన్ని విషయాలు చెప్పబోతున్నాము'' అన్నారు.

    జిలేబి పాత్రలో బ్రహ్మానందం కనిపించే ఈ చిత్రంలో వినోదం, యాక్షన్‌... తదితర అంశాలు అభిమానుల్ని మెప్పించేలా ఉంటాయి. వాణిజ్య విలువలతో కూడిన కథాంశమిది. వినోదాత్మకంగా సాగుతుంది. మగధీర' తర్వాత కాజల్,రామ్ చరణ్ కలిసి నటిస్తున్న చిత్రమిదే. ఈ చిత్రాన్ని యూనివర్శల్‌ మీడియా సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, రాహుల్‌దేవ్‌, రఘుబాబు, ఎమ్మెస్‌ నారాయణ, ఆశిష్‌ విద్యార్థి, ప్రదీప్‌ రావత్‌, సత్యం రాజేష్‌, సుధ తదితరులు నటిస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లే: ఆకుల శివ, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, సంగీతం: తమన్.

    English summary
    Ram Charan's Nayak is going to be a mass masala movie. Director VV Vinayak says that Ram Charan character would be with two different shades. ‘The Leader’ is the caption of this movie. Shooting of the film is going on in full swing. Thaman composes music.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X