»   » వైయస్సార్‌ సీపి పార్టీలో చేరటంపై వివి వినాయిక్

వైయస్సార్‌ సీపి పార్టీలో చేరటంపై వివి వినాయిక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : గత కొంత కాలంగా వివి వినాయిక్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేస్తారనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పొలిటకల్ ఎంట్రీపై స్పష్టత ఇచ్చారు. వినాయిక్ మాట్లాడుతూ .. . మా కుటుంబానికి రాజకీయంతో ప్రత్యక్ష సంబంధం ఉంది. మా నాన్న, తమ్ముడు ఇలా అందరూ రాజకీయాలకు దగ్గరగా ఉన్నవాళ్లే అందుకే ఆ వార్తలు వచ్చి ఉంటాయి. అయితే నేను మాత్రం ఇప్పట్లో రాజకీయాల్లోకి దిగాలనుకోవడం లేదు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి అన్నారు.

ప్రస్తుత తన కెరీర్ గురించి చెప్తూ...'' ఇప్పటికి మాత్రం బెల్లంకొండ సురేష్‌గారి అబ్బాయి సాయి శ్రీనివాస్‌ సినిమాపైనే దృష్టి సారిస్తున్నాను. ఇప్పటికే రెండు కథల్ని సిద్ధం చేసుకున్నాం. అయితే అవి ఆశించినమేర లేకపోవడంతో సినిమాని పట్టాలెక్కించలేదు. ఇప్పుడు ఓ కొత్త కథ సిద్ధమైంది. ఈ సినిమాలో సమంత హీరోయిన్. దేవిశ్రీప్రసాద్‌ సంగీతమందిస్తారు. యాక్షన్‌ తరహాలో సాగే వినోదాత్మక ప్రేమకథాచిత్రమిది. ఈ నెల 20 నుంచి చిత్రీకరణ ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. త్వరలో పూర్తి వివరాలు ప్రకటిస్తాం. అందరూ కొత్తవాళ్లతో ఓ సినిమాని చెయ్యాలని నేనెప్పటి నుంచో అనుకుంటున్నాను. అది వచ్చే సంవత్సరం ప్రారంభమవుతుంది.'' అన్నారు.

VV Vinayak

చిరంజీవి- రామ్‌చరణ్‌, బాలకృష్ణ- ఎన్టీఆర్‌తో ఇలా రెండు తరాలతోనూ సినిమాలు చేయడం ఆనందాన్నిస్తోంది. ఇలా అందరితోనూ సినిమాలు చేయాలన్నదే నా ఆలోచన. ఎన్టీఆర్‌ అయితే 'అదుర్స్‌ 2' చేద్దామంటున్నాడు. నేను పరాజయాన్ని అంత తొందరగా స్వీకరించలేను. అందుకే అది ఎదురుకాకుండా ఉండటానికే ప్రయత్నిస్తాను. దీంతోపాటు నన్ను నమ్మి నిర్మాత కోట్లు ఖర్చు పెడుతున్నాడు. ఈ రెండింటి వల్లే ప్రయోగాత్మక చిత్రాలకు దూరంగా ఉంటున్నాను. విజయవంతమైన ఫార్ములాతోనే సినిమాలు చెయ్యడానికి ఆసక్తి చూపిస్తున్నాను. కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు చేసేవారికి నాలుగు డబ్బులు మిగలాలనుకునే తత్త్వం నాది. ఈ ఆలోచనే నాతో వాణిజ్య విలువలున్న సినిమాల్ని చేయిస్తోంది. అవి మంచి ఫలితాన్నిచ్చాయి. ఇప్పుడు వాటికి హాస్యాన్ని జోడించాను. తర్వాత ఇంకా ఏ జోనర్‌కి వెళ్తానో చూడాలి అన్నారు.

ట్రెండ్ గురించి మాట్లాడుతూ... ప్రస్తుతం తమిళ సినిమాలు చూస్తుంటే అంతటా యువరక్తానిదే హవా. నటీనటులు, సాంకేతిక నిపుణులు... ఏ సినిమా చూసినా వారే కనిపిస్తున్నారు. త్వరలో తెలుగులోనూ ఈ పరిస్థితి వస్తుంది. మూస సినిమాలు.. ఒకే తరహా కథలు పోవాలంటే ఇదే మంచిది. అయితే ఆ సమయానికి మీరు నిర్మాత అయిపోతారా అని అడగొచ్చు. నాకైతే నిర్మాతగా మారే ఆలోచనే లేదు. ప్రస్తుతం నేను పని చేసిన సంస్థలన్నీ నా సొంత సంస్థలు లాంటివే. వారే కొత్తవాళ్లకి అవకాశాలిస్తారు. నా దగ్గరికి కథలతో వచ్చే కొత్త వాళ్లని కూడా వారి దగ్గరికే పంపిస్తాను. మన సినిమాల్లో ఉండే అన్ని అంశాల మసాలానే మనకు విజయాన్ని అందిస్తోంది. అందుకే మన కథలు కూడా హిందీలోకి వెళ్తున్నాయి అన్నారు.

English summary
There is strong rumour that V V Vinayak would be joining YSRCP party. VV VInayak clarifies...My family has been into politics for longtime but I am not going to join any party. Probably because some of my family members affiliation with a party, this news has come out.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X