»   » పవన్ కళ్యాణ్‌ పార్టీ: వివి వినాయక్, తనికెళ్ల భరణి కామెంట్

పవన్ కళ్యాణ్‌ పార్టీ: వివి వినాయక్, తనికెళ్ల భరణి కామెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'జన సేన' పార్టీ ఆవిర్బావ సభ సందర్భంగా చేసిన స్పీచ్‌పై పలువురు సినీ ప్రముఖులు పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. తాజాగా ఆ లిస్టులో వివి వినాయక్, తనికెళ్ల భరణి, నటుడు సురేష్ కూడా చేరారు. తన ప్రసంగంలో పవన్ కళ్యాణ్ సమస్యలు ప్రస్తావించారని, ఆయన కోరుకుంటున్న మార్పునే ప్రజలు కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

పవన్ కళ్యాణ్ ప్రసంగంపై నటుడు సురేష్ స్పందిస్తూ....'పవన్ కళ్యాణ్‌తో మరియు అతని ఆలోచన విధానంతో నేను ఏకీభవిస్తున్నాను. దేశం కోసం ఏదైనా మంచి చేయాలనుకునే ఇలాంటి దైర్యవంతున్ని నేను ఇప్పటి వరకు చూడలేదు. అతనికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాను. భవిష్యత్తులో కూడా ఆయన వెంట నడవటానికి నేను రెడీ' అన్నారు.

VV Vinayak about Pawan speech

తనికెళ్ల భరణి స్పందిస్తూ.....పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో ప్రసావించిన విషయాలను విన్నాను. ఆయన ఎంతో నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి రావడం మంచిదే. సమాజంలో మార్పు కోసం ఆయన చేస్తున్న ప్రయత్నం అభినందనీయం అని వ్యాఖ్యానించారు.

దర్శకుడు వివి వినాయక్ స్పందిస్తూ....'ప్రతి రోజు సామాన్యులు వివిధ సమస్యల గురించి, సమాజానికి సంబంధించిన అంశాలపై చర్చిస్తున్నారు. ప్రజల సమస్యలను పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో ప్రస్తావించడం ద్వారా ఆయన ప్రసంగం ప్రజలకు, యువతకు కనెక్ట్ అయింది' అన్నారు. అయితే ఆయన చిరంజీవి-పవన్ సంబంధాలపై స్పందించేందుకు నిరాకరించారు. చిరంజీవి 150 సినిమాకు వివి వినాయక్ దర్శకత్వం వహించే అవకాశం ఉండటంతో ఆయన ఆచితూచి మాట్లాడారు.

English summary
Pawan Kalyan's first ever political speech is highly impressive and hence it's been received well by a lot of people irrespective of cast, creed and religion.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu