'శ్రీరామ రాజ్యం' గురించి వివి వినాయిక్
బాపు, బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన శ్రీరామ రాజ్యం చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు వి వి వినాయిక్ చూసారు. ఆయన ఈ చిత్రం గురించి మాట్లాడుతూ...శ్రీరామ రాజ్యం చాలా అద్బుతమైన సినిమా. సినిమా చూస్తున్నంత సేపూ..ఆ టైమ్ కి వెళ్లిపోయినంత అధ్బుతంగా తీసారు బాపూగారు. ఆయనకి హాట్సాఫ్.అలాగే శ్రీరాముడుగా బాలకృష్ణ గారు అధ్బుతంగా చేసారు. జగదానందకర సాంగ్ లో ఆయన తన పరివారంతో నడుచుకుంటూ వస్తూంటే రామారావు గారినే చూసినట్లు అనిపించింది. అలాగే లవకుశలను పిల్లలని తెలియకుండా హత్తుకునే సన్నివేశంలో అద్బతంగా చేసారు బాలకృష్ణగారు. సీతగా చేసిన నయనతార లైప్ ధన్యమైంది అన్నారాయన. ఇక ప్రస్తుతం వి వి వినాయిక్ ..రామ్ చరణ్ తో చిత్రం చేస్తున్నారు.
రామ్ చరణ్, వివి వినాయిక్ కాంబినేషన్ లో యూనివర్సల్ మీడియా సంస్థ నిర్మిస్తున్న చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కథ... తండ్రికిచ్చిన మాట కోసం తనయుడు ఏం చేశాడనే పాయింట్ చుట్టూ తిరుగుతుంది. చిన్నపాటి టెన్షన్ తోపాటు మంచి యాక్షన్ సీన్స్ ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ ఏ మాత్రం తగ్గని సినిమా. దర్శకుడు వినాయక్ చిత్రం గురించి చెబుతూ ''చిరంజీవిగారితో 'ఠాగూర్' తీసిన రోజులు గుర్తొస్తున్నాయి. చిత్రీకరణ ఎప్పుడు ప్రారంభిస్తామో త్వరలో చెబుతాం. యువరాజు పెళ్లి ఉంది కదా? దానికి ముందా? తరవాత? అనేది ఇంకా నిర్ణయించలేదు. తప్పకుండా అందరినీ మెప్పించే సినిమా తీస్తామని అన్నారు.


Click it and Unblock the Notifications











