బెల్లకొండ తనయుడితో...వినాయక్ చిత్రం ప్రారంభం (ఫోటోలు)
హైదరాబాద్ : ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు శ్రీనివాస్‌ను హీరోగా పరిచయం చేస్తూ దర్శకుడు వివి వినాయక్ రూపొందిస్తున్న చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ రోజు హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దర్శకరత్న దాసరి నారాయణరావు, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, విక్టరీ వెంకటేష్, సిద్ధార్థ, సునీల్, రాఘవ లారెన్స్, పోసారి కృష్ణ మురళి, నిర్మాత దిల్ రాజు, శ్రీహరి, రచయిత ఆకుల శివ తదితరులు హాజరయ్యారు.
దర్శక రత్న దాసరి నారాయణరావు తొలిసన్నివేశానికి క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించారు. ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. బెల్లంకొండ సురేష్, బెల్లంకొండ గణేష్ బాబు శ్రీలక్ష్మి నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం. 4గా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, చోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ చేస్తున్నారు.
సినీ రంగంలోని ప్రముఖులంతా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రాణించాలని ఆకాంక్షించారు. దర్శకుడు వినాయక్ పూర్తి కమర్షియల్ ఘా ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ద్వారా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సక్సెస్ అవుతారనే నమ్మకం వ్యక్తం చేసారు ఈకార్యక్రమానికి హాజరైన అతిథులు.

తొలి సన్నివేశానికి క్లాప్ కొడుతున్న దర్శకరత్న దాసరి నారాయనరావు

చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాఘవేంద్రరావు, వెంకటేష్ తదితరులు

తెలుగు సినీ ప్రముఖులతో బెల్లంకొండ శ్రీనివాస్

బెల్లంకొండ సురేష్, బెల్లంకొండ శ్రీనివాస్, వివి వినాయక్, రాఘవేంద్రరావు

వెంకటేష్ తో బెల్లంకొండ శ్రీనివాస్


Click it and Unblock the Notifications











