రిలీజ్ లేటవటమే..ఎన్టీఆర్ 'అదుర్స్' కు ప్లస్
జూ ఎన్టీఆర్, వివి వినాయిక్ కాంబినేషన్ చిత్రం అదుర్స్ పోస్ట్ ప్రొడక్షన్ తో సహా అన్నీ పూర్తి చేసుకుని రిలీజ్ కు డిసెంబర్ లోనే రెడీ చేసారు. అయితే తెలంగాణ ఉద్యమం ఎఫెక్టుతో దానిని సంక్రాంతికి వాయిదా వేసారు. అయితే దర్శకుడు వివివినాయిక్ ఈ రిలీజ్ ను ప్లస్ గా భావించి అదుర్స్ ని మరింత మెరుగులు దిద్దుతున్నట్లు సమాచారం. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మళ్ళీ ప్రారంభించి చిత్రాన్ని మరింత క్రిస్ప్ గా ఎడిటింగ్ చేయిస్తున్నారని తెలుస్తున్నారు. అలాగే డబ్బింగ్ లో చిన్న చిన్న కరెక్షన్స్ చేయించి ధియోటర్ లో మరింత కిక్ తేవటానికి ప్రయత్నిస్తున్నారని చెప్తున్నారు. దాంతో ఈ చిత్రం రిలీజ్ లేటవటమే ఈ చిత్రం మరింత బాగా రావటానికి దోహదం చేసిందంటున్నారు. ఇక ఈ చిత్రం 36 కోట్ల వ్యయంతో రూపొందింది. ఎన్టీఆర్ సరసన నయనతార, షీలా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఛోటా కె.నాయుడు ఛాయాగ్రహణం చేస్తే వల్లభనేని వంశీ, కొడాలి నాని ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసే ఈ కథను కోనవెంకట్ సమకూర్చారు.


Click it and Unblock the Notifications











