twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బన్నీ బద్రీనాథ్ తర్వాత చిరంజీవి సినిమా చేస్తా: వివి వినాయక్..!

    By Sindhu
    |

    మెగాస్టార్ చిరంజీవి సినిమాలలోకి రిఎంట్రీ చేస్తూ 150వ చిత్రం చేయడం దాదాపు ఖరారైనట్టే తెలుస్తోంది. ఈ చిత్రానికి వివి వినాయక్ దర్శకత్వం వహించానున్నడనే వార్త ప్రస్తుతం ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతుంది. చిరంజీవి సొంత నిర్మాణ సంస్థ లియో ప్రాజెక్ట్స్ బ్యానర్ ఫై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మరో రెండు నెలలలో ఈ సినిమాకు సంబందించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.

    మెగాస్టార్ చిరంజీవి నటించే సినిమా త్వరలో ప్రారంభం కానుందా? ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ చెప్పిన మాటల్ని బట్టి చూస్తే ఇది నిజమే అనిపిస్తోంది. చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్లీ చిరంజీవి నటించనున్న సినిమాకి తాను దర్శకత్వం వహించనున్నట్టు వినాయక్ రీసెంట్ గా తిరుమలలో మీడియాకు తెలియజేశారు. వేంకటేశుని దర్శనార్ధం ఆయన తిరుమల వెళ్ళిన వినాయక్ ఈ సందర్భంగా దేవాలయం వద్ద తనను కలిసిన పాత్రికేయులతో వినాయక్ కాసేపు మాట్లాడారు. ప్రస్తుతం అల్లు అర్జున్ తో చేస్తున్న 'బద్రీనాథ్' చిత్రం విడుదలైన తర్వాత చిరంజీవితో రూపొందించే సినిమా మొదలవుతుందని వినాయక్ చెప్పారు. 'బద్రీనాథ్' సినిమా ఓ గొప్ప అనుభూతినిచ్చే సినిమాగా రూపొందుతోందని ఆయన చెప్పారు.

    ప్రస్తుతం చిరంజీవి కడప ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించే సన్నాహాల్లో ఉన్నారు. ఏప్రిల్ 27 నుండి కాంగ్రెస్ తరపున ప్రచారం లో పాల్గొననున్నారు. పులివెందుల అసెంబ్లీ, కడప పార్లమెంట్ ఎన్నికలు ముగిసి, ఫలితాలు వెలువడిన తరవాత చిరంజీవి తన 150వ చిత్రాన్ని ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. సామజిక న్యాయం ఇతివృత్తంతో సినిమా కధ సిద్దం అవుతుందని సమాచారం. కాగా రాజకీయాల్నిప్రక్కన పెట్టి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోన్న చిరంజీవి, వినాయక్ సినిమాతో టాలీవుడ్ లో మళ్ళీ ప్రభంజనం సృష్టించగలరా..? వేచి చూడాల్సిందే..

    English summary
    Megastar Chiranjeevi’s re-entry into films has been confirmed long back but the plans to launch that mega venture have been postponed due to the sudden change in the politics. Director VV Vinayak is zeroed on, to take up this prestigious film. Chiranjeevi recently watched Allu Arjun’s ‘Badrinath’ rushes and was very impressed with Vinayak’s work in it. Therefore, he asked Vinay to wield the megaphone for his 150th film, says reports.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X