పవన్ తో మంచి సినిమా తీయండంటూ వివి వినాయక్ కి వార్నింగ్స్
పవన్ కళ్యాణ్ - వివి వినాయక్ ల సూపర్ కాంబినేషన్ లో ఓ సినిమా రానుందనీ, ఆ చిత్రం కోసం 2011 మార్చి నుండి పవన్ కళ్యాణ్ డేట్స్ కూడా ఇచ్చేశారనీ చాలా రోజుల నుండి వినవస్తున్న సమాచారం. ఇప్పుడా క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించిన మరిన్ని వివరాల్లోకి వెళితే..పవన్ -వినయ్ ల తొలి కలయికలో రానున్న ఈ చిత్రానికి ఆకుల శివ సిద్దం చేస్తోన్న స్ర్కిప్ట్ అద్భుతంగా వచ్చిందనీ, ఇందులో పవర్ స్టార్ సరసన ఇద్దరు హీరోయిన్స్ వుంటారనీ తెలిసింది. అలాగే ఆల్ రెడీ పవన్ ఫ్యాన్స్ ని ఓసారి 'జల్సా" చేయించిన దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చే అవకాశం వుందని సమాచారం. అన్నట్టు..వివి వినాయక్ పిల్లలిద్దరూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అవడం వలన 'పవన్ అంకుల్ తో మంచి సినిమా తియ్యండి డాడీ" అంటూ కొడుకు - కూతురు ఇద్దరూ కలిసి ముద్దు ముద్దుగా వినయ్ కి వార్నింగ్స్ ఇస్తున్నారట.
More from Filmibeat
పవన్ కళ్యాణ్ వివి వినాయ్ ఆకుల శివ దేవిశ్రీ ప్రసాద్ జల్సా ఖుషిగా లవ్ ఆజ్ కల్ pawan kalyan vv vinayak akula shiva devisri prasad jalsa khushiga love aaj khal


Click it and Unblock the Notifications











