twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'ఇంటిలిజెంట్‌' సూపర్‌హిట్‌.. అదుర్స్2, మహేశ్‌తో సినిమా ప్లానింగ్.. వినాయక్

    సుప్రీం హీరో సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా లావణ్య త్రిపాఠి హీరాయిన్‌ గా నిర్మాత సి.కళ్యాణ్‌ నిర్మించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'ఇంటిలిజెంట్‌'. ఈ చిత్రం ఫిబ్రవరి 9న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ అవుతుంది. ఈ సందర్భంగా

    By Rajababu
    |

    యాక్షన్‌ అయినా, ఫ్యాక్షన్‌ అయినా.. ఎంటర్‌టైన్‌మెంట్‌ అయినా, ఎమోషన్‌ అయినా ఎలాంటి చిత్రాన్నైనా స్క్రీన్‌పై ఆవిష్కరించి ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేయగల దమ్మున్న డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌. సెన్సేషనల్‌ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న వి.వి.వినాయక్‌ లేటెస్టుగా 'ఇంటెలిజెంట్‌' చిత్రానికి దర్శకత్వం వహించారు. సినిమా కూడా గ్యారెంటీగా హిట్‌ అవుతుందని చిత్ర యూనిట్‌ కాన్ఫిడెంట్‌గా చెప్తోంది. సుప్రీం హీరో సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా లావణ్య త్రిపాఠి హీరాయిన్‌ గా నిర్మాత సి.కళ్యాణ్‌ నిర్మించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'ఇంటిలిజెంట్‌'. ఈ చిత్రం ఫిబ్రవరి 9న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ అవుతుంది. ఈ సందర్భంగా సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి. వినాయక్‌తో ఇంటర్వ్యూ విశేషాలు..

    సినిమా ఫస్ట్‌ కాపీ చూసుకున్నాక ఎలా ఫీల్‌ అయ్యారు?

    సినిమా ఫస్ట్‌ కాపీ చూసుకున్నాక ఎలా ఫీల్‌ అయ్యారు?

    నిన్ననే సినిమా అంతా చూసుకుని అందరం చాలా ఆనందంగా, హ్యాపీగా ఫీల్‌ అయ్యాం. ఖచ్చితంగా సూపర్‌హిట్‌ కొడతామని నమ్మకంతో వున్నాం. బేసిగ్గా ఇది మంచి హ్యూమర్‌, కామెడీ, యాక్షన్‌, బ్యూటిఫుల్‌ సాంగ్స్‌ వున్న పక్కా కమర్షియల్‌ మూవీ. రీసెంట్‌గా సెన్సార్‌ కంప్లీట్‌ అయ్యింది. సభ్యులంతా సినిమా చూసి చాలా బాగుంది అని అప్రిషియేట్‌ చేశారు.

    Recommended Video

    Sai Dharam Tej Next Movie With A Crazy Director
    ఆడియోకి ఎలాంటి ఫీడ్‌ బ్యాక్‌ వస్తోంది?

    ఆడియోకి ఎలాంటి ఫీడ్‌ బ్యాక్‌ వస్తోంది?

    'నాయక్‌' సినిమా తర్వాత మళ్ళీ థమన్‌తో కలిసి వర్క్‌ చేశాను. నాయక్‌ ఆడియోతో పాటు సినిమా కూడా చాలా పెద్ద హిట్‌ అయ్యింది. 'ఇంటిలిజెంట్‌'కి థమన్‌ ఎక్‌ట్రార్డినరీ మ్యూజిక్‌ ఇచ్చాడు. నాలుగు సాంగ్స్‌ సూపర్‌హిట్‌ అయ్యాయి. రీరికార్డింగ్‌ అద్భుతంగా చేశాడు.

    నిర్మాత సి.కళ్యాణ్‌ మేకింగ్‌ ఎలా వుంది?

    నిర్మాత సి.కళ్యాణ్‌ మేకింగ్‌ ఎలా వుంది?

    నేను అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వున్నప్పటి నుండి నాకు కళ్యాణ్‌గారు తెలుసు. ఇద్దరం ఫ్రెండ్స్‌లాగా వుంటాం. ఎప్పుడు షూటింగ్‌ జరిగినా ఎలాంటి అవాంతరాలు లేకుండా అన్నీ సమకూర్చి అన్‌కాంప్రమైజ్డ్‌గా ఎంతో ఖర్చు పెట్టి చాలా రిచ్‌గా ఈ చిత్రాన్ని నిర్మించారు. సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో 'ఇంటిలిజెంట్‌' సినిమా పెద్ద హిట్‌ చిత్రంగా నిలుస్తుందని కాన్ఫిడెన్స్‌గా చెబుతున్నాను. జనరల్‌గా నేను అందర్నీ బాగా చూసుకుంటాను. అలాంటి నన్ను ఒక గాజు బొమ్మలాగా కళ్యాణ్‌గారు చూసుకున్నారు. ప్రొడక్షన్‌ సైడ్‌ ఎలాంటి ప్రాబ్లెమ్స్‌ లేకుండా సి.వి.రావు, పత్స నాగరాజా ఎంతగానో సపోర్ట్‌ చేశారు.

    సాయిధరమ్‌ తేజ్‌ క్యారెక్టర్‌ ఎలా వుంటుంది?

    సాయిధరమ్‌ తేజ్‌ క్యారెక్టర్‌ ఎలా వుంటుంది?

    సరదాగా లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తూ వుండే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా తేజ్‌ తన స్టైల్‌లో బాగా చేశాడు. కామెడీ, యాక్షన్‌ సీన్స్‌లలో అద్భుతంగా చేశాడు. పర్టిక్యులర్‌గా కొన్ని షాట్స్‌లో అచ్చం చిరంజీవిగారిలా కన్పించాడు. సాయి అంతకు ముందు చేసిన చిత్రాల్లో కంటే ఈ చిత్రంలో పాటలు చాలా బాగుంటాయి. డ్యాన్స్‌లు ఇరగదీశాడు. శేఖర్‌, జానీ మాస్టర్స్‌ ఎంతో కష్టపడి రిహార్సల్స్‌ చేశారు. అందులోని బెస్ట్‌ మూవ్‌మెంట్స్‌ని సెలెక్ట్‌ చేసుకుని చేశాం.

    ఈ సినిమా మెయిన్‌ కథాంశం ఏమిటి?

    ఈ సినిమా మెయిన్‌ కథాంశం ఏమిటి?

    విశ్వాసానికి మారుపేరుగా నిలుస్తూ... తనకి సాయం చేసిన ఒక గాడ్‌ఫాదర్‌ లాంటి వ్యక్తికి అన్యాయం జరిగితే అతని కోసం హీరో ఎలా రియాక్ట్‌ అయ్యాడు? విలన్‌ మీద ఎలా పోరాడాడు? అనేది మెయిన్‌ కథాంశం. ఒక చిన్న మైండ్‌గేమ్‌ని హీరో 'ఇంటిలిజెంట్‌'గా ఎలా డీల్‌ చేశాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా వుంటుంది.

    చమక్‌ చమక్‌' సాంగ్‌ని రీమిక్స్‌ చేయాలన్న థాట్‌ ఎవరిది?

    చమక్‌ చమక్‌' సాంగ్‌ని రీమిక్స్‌ చేయాలన్న థాట్‌ ఎవరిది?

    అన్నయ్య సినిమాల్లోని నాకు చాలా ఇష్టమైన పాట అది. 'చమక్‌ చమక్‌' పాట పెట్టాలని అందరం అనుకున్నాం. కళ్యాణ్‌గారు ఇళయరాజాగారిని అప్రోచ్‌ అయ్యి ఈ పాట రీమిక్స్‌ గురించి అడగ్గానే ఆయన చాలా ఆనందంగా స్పందించి ఓకే చేశారు. ఈ పాటని రోమన్‌లో అద్భుతమైన లొకేషన్స్‌లో చిత్రీకరించాం. ఒరిజినల్‌ పాటకి ఏమాత్రం తీసిపోని విధంగా వుంటుంది.

    హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి గురించి?

    హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి గురించి?


    ఫస్ట్‌టైమ్‌ ఫుల్‌ కమర్షియల్‌ మూవీలో లావణ్య త్రిపాఠి నటించింది. ఈ సినిమాతో లావణ్య పెద్ద కమర్షియల్‌ హీరోయిన్‌ అవుతుంది. సంధ్య క్యారెక్టర్‌లో లావణ్య ఫెంటాస్టిక్‌గా పెర్‌ఫార్మ్‌ చేసింది. డ్యాన్స్‌లు కూడా బాగా చేసింది.

    'అదుర్స్‌-2', మహేష్‌తో

    'అదుర్స్‌-2', మహేష్‌తో

    రెండు మూడు కథలు అనుకున్నాం. కానీ మేం శాటిస్‌ఫై అయ్యేంతగా అన్పించలేదు. అదుర్స్‌ సినిమాని మించి 'అదుర్స్‌-2' తీయాలని మంచి కథ కోసం వెయిట్‌ చేస్తున్నాను. తప్పకుండా 'అదుర్స్‌-2' చేస్తాను. మహేశ్‌బాబు, నా కాంబినేషన్‌లో తప్పకుండా సినిమా వుంటుంది. మంచి కథ కోసం వెయిట్‌ చేస్తున్నాం.

    ప్రొడక్షన్‌ హౌస్‌ స్టార్ట్‌ చేసే ఉద్దేశం వుందా?

    ప్రొడక్షన్‌ హౌస్‌ స్టార్ట్‌ చేసే ఉద్దేశం వుందా?

    నాకు కొన్ని ఐడియాలు వున్నాయి. కొత్త దర్శకులను ప్రోత్సహిస్తూ మంచి కాన్సెప్ట్‌ బేస్డ్‌ మూవీస్‌ తీయాలని ప్లాన్‌ చేస్తున్నాను. అదీ రెండు సంవత్సరాల తర్వాత ప్రొడక్షన్‌ స్టార్ట్‌ చేస్తాను.

    మీ నెక్స్‌ట్‌ ప్రాజెక్ట్‌ ఏంటి?

    మీ నెక్స్‌ట్‌ ప్రాజెక్ట్‌ ఏంటి?

    ఇంకా ఏం కమిట్‌ కాలేదు. ప్రస్తుతానికి 'ఇంటిలిజెంట్‌' మీదే నా ఫోకస్‌ అంతా వుంది. రెండు నెలలు గ్యాప్‌ తీసుకుని నెక్స్‌ట్‌ చేయబోయే సినిమా గురించి ఆలోచిస్తాను.

    English summary
    Sai Dharam Tej is currently gearing up for the release of Intelligent. A VV Vinayak directorial, it is slated to hit screens this week and has created a buzz amongst fans courtesy its intriguing poster. The film’s pre-release was held Feb 4th at Rajamaudry. The movie set to release on 9th february. In this occassion, Vinayak spoke to Telugu Filmibeat exclusively.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X