twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోదామనుకున్నా.. ఆయనే ఆపాడు: వీవీ వినాయక్

    |

    వీవీ వినాయక్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. తెలుగు సినీ ఇండస్ట్రీలో మాస్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. రెండు తరాల హీరోలతో సినిమాలు చేసిన ఘనతను దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే 'ఆది', 'దిల్', 'ఠాగూర్', 'బన్నీ', 'లక్ష్మీ', 'అదుర్స్', 'నాయక్', 'ఖైదీ నెంబర్ 150' వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అదించాడు. దీంతో టాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్ల స్థాయికి చేరుకున్నాడు. దర్శకుడిగా సక్సెస్ అయిన వినాయక్.. త్వరలోనే హీరోగా పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే.

    శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు తెరకెక్కించబోయే సినిమాలో వీవీ వినాయక్ హీరోగా పరిచయం కాబోతున్నారు. దీన్ని ఇరువురూ ప్రకటించేశారు కూడా. దర్శకుడు శంకర్‌ వద్ద సహాయకుడిగా పనిచేసిన ఎన్‌ నరసింహారావు ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. గతంలో ఈయన 'శరభ' అనే సినిమాకు దర్శకత్వం వహించారు. ఇందులో వినాయక్‌‌ పాత్ర ఎంతో ప్రత్యేకంగా ఉంటుందని తెలుస్తోంది. అందుకే దీని కోసం ఆయన కొద్దిరోజులుగా జిమ్‌లో కసరత్తులు చేస్తున్నాడు.

    VV Vinayak Intresting Comments on Director Srinivas Reddy

    ఇక, 'అదిరిందయ్యా చంద్రం', 'టాటా బిర్లా మధ్యలో లైలా', 'ఢమరుకం' వంటి చిత్రాలను తెరకెక్కించిన శ్రీనివాస్‌రెడ్డి దర్శకత్వంలో, శ్రీనవ్‌హాస్‌ క్రియేషన్స్‌ పతాకంపై శ్రీ కార్తికేయ సెల్యులాయిడ్స్‌ సమర్పణలో వస్తున్న చిత్రం 'రాగల 24 గంటల్లో'. ఇందులో ఈషా రెబ్బా లీడ్ రోల్ చేస్తుండగా సత్యదేవ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ను వినాయక్‌ తాజాగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

    చిత్ర దర్శకుడు గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 'నేను సినిమాల్లోకి రాక ముందు నుంచే శ్రీనివాస్ రెడ్డి నాకు మంచి ఫ్రెండ్. ఆయన నాకు ఎన్నో సలహాలు ఇచ్చేవాడు. ముఖ్యంగా అప్పట్లో నేను చెన్నైలో ఉండలేక వెళ్లిపోదాం అనుకున్నా. కానీ, శ్రీనునే నాకు ధైర్యం చెప్పి నాలో నమ్మకాన్ని నింపాడు. దీంతో నన్ను ఇండస్ట్రీకి దూరం కాకుండా ఆపాడు' అని చెప్పుకొచ్చారు.

    English summary
    Producer Dil Raju is basking in glory over the grand success of his latest production venture Maharshi. The producer was in Tirupati to offer his prayers to Lord Venkateswara on the success and handed out a press note that came as a surprise.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X