వివి వినాయక్‌పై మెగా ఒత్తిడి..!

By Bojja Kumar

హైదరాబాద్: తనకు 'ఆది' సినిమాతో దర్శకుడిగా ఛాన్స్ ఇచ్చిన నిర్మాత బెల్లంకొండ సురేష్ రుణం తీర్చుకోవాలని నిర్ణయించుకున్న వివి వినాయక్.....బెల్లంకొండ సురేష్ తనయుడు సాయి శ్రీనివాస్‌ను హీరోగా పరిచయం చేస్తూ 'అల్లుడు శీను' చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

'అల్లు శీను' సినిమా కోసం వివి వినాయక్ చాలా కష్ట పడ్డాడు. ఒక కొత్త హీరోతో సినిమా చేయడం ఒక రిస్క్ అయితే....భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం పెట్టుబడి మళ్లీ నిర్మాతకి తిరిగొచ్చేలా చేయడం కూడా పెద్ద భారమే. మొత్తానికి తన మార్కు ఉండేలా 'అల్లుడు శీను' చిత్రాన్ని తెరకెక్కించిన వినాయక్... నిర్మాతను, కొత్త హీరోను ఒడ్డుకు చేర్చాడనే చెప్పొచ్చు.

VV Vinayak is almost confirmed for 150th film

'అల్లుడు శ్రీను' తర్వాత వివి వినాయక్‌పై మళ్లీ పెద్ద భారమే పడబోతోంది. చిరంజీవి 150వ సినిమాకు వివి వినాయక్ దాదాపుగా ఖరారైనట్లే అని అంటున్నారు. అదే నిజమైతే వినాయక్‌పై మెగా ఒత్తిడి పడటం ఖాయంగా కనిపిస్తోంది. చిరంజీవితో సినిమా అంటే మాటలు కాదు. పైగా 150 చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు చిరంజీవి.

అటు మెగా అభిమానులను పూర్తి స్థాయిలో సంతృప్తి పరిచేలా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాలి, అదే సమయంలో చిరంజీవి ఇమేజ్‌కి తగిన విధంగా సినిమా ఉండాలి. గతంలోలా చిరంజీవితో ఎలా పడితే అలా సినిమా చేయడం వీలుకాదు. ఆయన ఇపుడు ఓ బాధ్యతగల రాజకీయ నాయకుడు. అన్ని అంశాలను బ్యాలెన్స్ చేస్తూ సినిమా తీయడం అంటే టెన్షన్స్‌తో తల గోక్కోవడమే! ఒత్తిడితో సహజీవనం చేయడమే!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X