హాట్ టాపిక్ అవుతున్న వీవీ వినాయక్ న్యూ లుక్.. గతంలో ఎప్పుడూ చూడని విధంగా.!
వీవీ వినాయక్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. తెలుగు సినీ ఇండస్ట్రీలో మాస్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. రెండు తరాల హీరోలతో సినిమాలు చేసిన ఘనతను దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే 'ఆది', 'దిల్', 'ఠాగూర్', 'బన్నీ', 'లక్ష్మీ', 'అదుర్స్', 'నాయక్', 'ఖైదీ నెంబర్ 150' వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అదించాడు. దీంతో టాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్ల స్థాయికి చేరుకున్నాడు. దర్శకుడిగా సక్సెస్ అయిన వినాయక్.. త్వరలోనే హీరోగా పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెరకెక్కించబోయే సినిమాలో వీవీ వినాయక్ హీరోగా పరిచయం కాబోతున్నారు. దీన్ని ఇరువురూ ప్రకటించేశారు కూడా. దర్శకుడు శంకర్ వద్ద సహాయకుడిగా పనిచేసిన ఎన్ నరసింహారావు ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. గతంలో ఈయన 'శరభ' అనే సినిమాకు దర్శకత్వం వహించారు. ఇందులో వినాయక్ పాత్ర ఎంతో ప్రత్యేకంగా ఉంటుందని తెలుస్తోంది. అందుకే దీని కోసం ఆయన కొద్దిరోజులుగా జిమ్‌లో కసరత్తులు చేస్తున్నాడు.

ఈ సినిమా కోసం వినాయక్ ఎంతగానో కష్ట పడుతున్న విషయం తెలిసిందే. అదే సమయంలో ఆయన సరికొత్త లుక్‌ను చూపించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వినాయక చవితి సందర్భంగా ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రాజుగారి గది 3' సినిమా పోస్టర్ విడుదల చేశాడు వినాయక్. ఈ కార్యక్రమంలో అతడి లుక్ అందరినీ ఆకర్షించింది. మొదటి నుంచీ రింగుల జుట్టుతో కనిపించే ఆయన.. ఉన్నట్లుండి పక్క పాపిడి తీశాడు. దీంతో ఈ ఫొటో సోషల్ మీడియాలో షేర్ చేశారు కొందరు. అప్పటి నుంచి ఈ పిక్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











