జూ ఎన్టీఆర్ కి డేట్స్ ఖాలీలేవన్న రాజమౌళి..దొరకని వివి వినాయక్..!

By Sindhu

జూ ఎన్టీఆర్ ఇమేజ్ ని ఓ రేంజేలో పెంచిన దర్శకుల్లో రాజమౌళి, వినాయక్ లది ముఖ్య పాత్ర అని చెప్పొచ్చు. ఇటీవల ఎన్టీఆర్ నటించిన చిత్రాలు యావరేజ్, లేదా ఎబౌవ్ యావరేజ్ చిత్రాలుగానే బాక్సాఫీస్ వద్ద నిలుస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఓ సూపర్ డూపర్ హిట్ ఇచ్చి 'పోకిరి",'మగధీర" రికార్డులను బ్రేక్ చేయాలనుకుంటున్నాడట ఎన్టీఆర్. ఈ నేపథ్యంలో వివి వినాయక్, రాజమౌళి అయితేనే తనకు అంతటి హిట్ ఇవ్వగలరని భావిస్తున్నాడట. ఎలాగైనా వీరి డేట్స్ తీసుకోవాలని ఎన్టీఆర్ అనుకుంటున్నప్పటికీ ఈ ఇద్దరూ డేట్స్ దొరకడంలేదని తెలుస్తోంది.

రాజమౌళి 'ఈగ", ప్రభాస్ చిత్రాలతో బిజీగా ఉంటే, వివి వినాయక్ 'బద్రీనాథ్" తర్వాత రామ్ చరణ్ తో సినిమా కమిట్ అయ్యాడట. అలాగే చిరంజీవి 150వ సినిమా కూడా వినాయక్ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ నేపధ్యంలో వినాయక్ కూడా ఎన్టీఆర్ కి దొరికే అవకాశం లేదని పరిశీలకులు అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X