»   » జూ ఎన్టీఆర్‌తో వినాయక్ ‘అదుర్స్ 2’ ప్లాన్స్

జూ ఎన్టీఆర్‌తో వినాయక్ ‘అదుర్స్ 2’ ప్లాన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన 'అదుర్స్' చిత్రం మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్‌లో కామెడీ పండించే సరికొత్త యాంగిల్‌ను ప్రేక్షకులకు పరిచయం చేసి సక్సెస్ అయ్యాడు వినాయక్.

ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతుందనే వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వినాయక్ స్పందించారు. ఆ మధ్య తారక్(జూ ఎన్టీఆర్) 'అదుర్స్' సీక్వెల్ తీద్దామనే ఆలోచన చేసిన మాట వాస్తవమే అని వెల్లడించారు. అన్ని కుదిరితే సీక్వెల్ తీస్తామనే సంకేతాలు ఇచ్చారు వినాయక్.

స్వయంగా వివి వినాయక్ నోటి నుంచే 'అదుర్స్ 2' సినిమా వార్త రావడంతో నందమూరి అభిమాను హ్యాపీగా ఉన్నారు. త్వరలోనే సినిమా తప్పకుండా పట్టాలెక్కుతుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. గతంలో వినియక్, జూ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు భారీ బ్లాక్ బస్టర్స్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం వివినాయక్ బెల్లంకొండ తనయుడు శ్రీనివాస్‌ను హీరోగా వెండి తెరకు పరిచయం చేసే బాధ్యతను భుజానేసుకున్నారు. సినిమా ఇప్పటికే ప్రారంభం అయినా....స్టోరీ విషయంలో సమస్య రావడంతో సినిమా లేటవుతూ వస్తోంది. ఈచిత్రంలో శ్రీనివాస్ సరసన సమంత హీరోయిన్‌గా చేస్తోంది.

భవిష్యత్‌లో జూనియర్ ఎన్టీఆర్, వివి వినాయక్ కాంబినేషన్లో సినిమా వస్తే...అది తప్పకుండా 'అదుర్స్'కు సీక్వెలే అని ఊహించవచ్చు!. అయితే ఎప్పుడు వస్తుందనే విషయం తేలాలంటే కొంత కాలం వెయిట్ చేయాల్సిందే.

English summary
"Tarak (NTR Jr) has been asking me to do Adhurs 2. Have to think about it" director VV Vinayak told.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu