వివివినాయక్ బాటలో పూరి జగన్నాథ్!!!
బుజ్జిగాడు పేరున్న సినిమాలు నిర్మాణ దశలోనే వివాదాస్పదంగా మారుతున్నాయి. ఇప్పటికే బెజవాడ బుజ్జి సినిమాకు దర్శకత్వం వహిస్తున్న వివివినాయక్ తన సినిమాకు ముందు రమణ గోగులను సంగీత దర్శకుడిగా పెట్టుకుని రెండు మూడు పాటలు రికార్డు కూడా చేసిన తరువాత ఆయనను పీకేసి ఆయన స్థానంలో మణిశర్మను పెట్టుకున్నాడు. ఈ సినిమాలో రవితేజ, త్రిషా హీరోహీరోయిన్లుగా చేస్తున్నారు.
ఇపుడు బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నయ్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న పూరి జగన్నాథ్ కూడా సేమ్ టు సేమ్ చేశాడు. ఈ సినిమాకు ముందుగా దేవిశ్రీ ప్రసాద్ అనుకొని ఇపుడు ఆయన స్థానంలో సందీప్ చౌతాను పెట్టుకున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్, త్రిషా హీరోహీరోయిన్లుగా చేస్తుండగా సంజనా కూడా మరో హీరోయిన్ గా చేస్తున్నది.


Click it and Unblock the Notifications











