వారిద్దరి దర్వకత్వంలో బాలయ్య-జూ ఎన్టీఆర్ ల ప్రాజెక్ట్ కుదిరితే సంచలనమే...!

By Sindhu

ఆదివారం జరిగిన 'బృందావనం" ప్లాటినం డిస్క్ వేడుకల్లో పలు ఆసక్తికరమైన ప్రకటనలు వెలువడ్డాయి. ఈ ఫంక్షన్ లో వినాయక్ మాట్లాడుతూ రాజమౌళి తను కలిసి ఎన్టీఆర్ తో ఓ చిత్రానికి దర్శకత్వం వహించాలని వుందని చెప్పగా, రాజమౌళి దీనికి అదనంగా తారక్ తో పాటు బాలయ్య కూడా ఈ చిత్రంలో నటిస్తే ఇంకా బాగుంటుందని చెప్పారు. ఈ వార్త వినగానే అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఎంతైనా ఇద్దరు టాప్ డైరెక్టర్లు బాబాయ్, అబ్బాయిలను డైరెక్ట్ చేస్తూ ఓ సినిమా చేస్తే నిజంగా అదో పెద్ద సంచలనమే. నిజంగా ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చాలని అభిమానులు కోరుకుంటున్నారు.

జూ ఎన్టీఆర్ లవర్ బోయ్ లా వుండలేడా, ఫ్యామిలీ సినిమాలు చెయ్యలేడా, ఎప్పుడూ కత్తి పట్టుకుని నరుక్కొంటూనే వెళ్లాడా? అనే ప్రశ్నలకు 'బృందావనం" సరైన సమాధానం చెప్పింది"..ఈ మాటలన్నది ఎవరో కాదు మన యంగ్ టైగర్ ఎన్టీఆర్. అంతే కాదు ఫ్లాప్ సినిమా చేసిన వంశీతో సినిమా చేస్తున్నావేమిటి అని అందరూ ఆశ్చర్యంగా అడిగారు. తన ప్రయత్నంలో లోపం తప్పితే వంశీ ప్లాప్ డైరెక్టర్ కాదు. తను గొప్ప డైరెక్టర్ అని మున్నాతో ప్రూవ్ చేసుకున్నాడు. బృందావనం లాంటి అద్భుతమైన కథను అంతకంటే అద్బుతంగా తెరకెక్కించాడు. డైలాగ్ రైటర్ కొరటాల శివ పవర్ ఫుల్ డైలాగ్స్ రాశాడు. తమన్ ఎక్స్ లెంట్ మ్యూజిక్ ఇచ్చాడు. చోటా అన్న అద్బుతంగా తీశాడు.

ఈ సినిమాకి పినిచేసిన ప్రతి ఒక్కరికీ అప్రిషియేషన్ వస్తోంది. ఒక మంచి సినిమా చేసి మీ కోరిక తీరుస్తాను, దాన్ని హిట్ చేసి నాకోరిక తీర్చండి అని ఆడియో ఫంక్షన్ లో అడిగాను. నేను అడిగినట్టుగానే సినిమాని పెద్ద హిట్ చేశారు. ఈ రోజు ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా వుంది అన్నాడు.జూ ఎన్టీఆర్. ఈ చిత్రం యాభై రోజుల ఫంక్షన్ నిజామాబాద్ లో చేస్తాం ఎప్పుడు చేస్తామనేది త్వరలోనే చెప్తాను" నిర్మాత దిల్ రాజు ప్రకటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X