జూ ఎన్టీఆర్ అదుర్స్ చిత్రంలో మరో స్పెషల్
టాప్ డైరక్టర్ వివి వినాయిక్ తన తాజా చిత్రం అదుర్స్ లోని ఓ పాటలో డాన్స్ చేస్తూ కనపడుతున్నాడు. ఎన్టీఆర్ సూచన,పట్టుపై వినాయిక్ ఈ సీక్వెన్స్ లో డాన్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సీక్వెన్స్ కు ధియోటర్స్ లో మంచి అప్లాజ్ వస్తుందని ఫిల్మ్ వర్గాలు అంటున్నాయి. ఇక వినాయిక్ సినిమాలో కనపడటం ఇదే మొదటి సారి కాదు..ఇంతకు ముందు చిరంజీవి ఠాగూర్ చిత్రంలో ఓ ప్రత్యేకమైన పాత్రలో కనపడి శభాష్ అనిపించుకున్నారు. అలాగే శ్రీను వైట్ల,రాజమౌళి వంటి స్టార్ డైరక్టర్స్ సైతం గతంలో వెండి తెరపై గెస్ట్ లుగా అలా మెరిసిన సంగతి తెలిసిందే.
ఎంతో హైప్ తో రిలీజ్ కు రెడీ అవుతున్న అదుర్స్ లో మరెన్నో స్పెషాలిటీస్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో తొలిసారిగా ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసారు. అలాగే ఈ చిత్రంలో తొలిసారిగా నయనతార, షీలా అతనికి జోడీగా కనిపించనున్నారు. వీటికి తోడు భిళ్లా తో తొలిసారిగా బికినీ వేసిన నయనతార ఈ చిత్రంలోనూ మరోసారి బికినీలో కనిపించి కనువిందు చేయనుంది. ఇవే కాక అందాల భామ ఛార్మీ ఓ ఐటం సాంగ్ లో తన అందచందాలు ఒలకపోయనుంది. ఈ చిత్రంకోసం లవకుశ, అదుర్స్, వాడే వీడు టైటిల్స్ ను ఎన్నుకున్నారు. చివరకు అదుర్స్ ఫైనలైజ్ చేసారు. రెండు పాత్రల్లో ఒకటి భ్రాహ్మణ పాత్ర,మరొకటి డాన్ పాత్ర అని తెలుస్తోంది.
సెకెండాఫ్ లో ఒకరి ప్లేస్ లోకి మరొకరు వెళ్లినప్పుడు వచ్చే కామిడీ హిలేరియస్ గా ఉంటుందని చెప్తున్నారు. ఈ నెల 18న రిలీజ్ అవుతున్న ఈ చిత్రానికి వివివినాయిక్ దర్శకత్వం వహిస్తే కోనవెంకట్ కథ-మాటలు అందించారు. అలాగే ఈ చిత్రం పూర్తి స్టాయి కామిడీ ఎంటర్టైనర్. దేవీ ప్రసాద్ సంగీతం అందించిన ఆడియో రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకుంది. ఇందులో మహేష్ ముంజ్రేకర్ విలన్ గా చేసారు. మహేష్ ముంజ్రేకర్ గతంలో గోపీచంద్ ఒక్కడున్నాడు చిత్రంలో విలన్ గా చేయటం తెలిసిందే.


Click it and Unblock the Notifications











