వివి వినాయక్ విమాక్స్ థియేటర్ కూల్చివేత.. కారణం ఇదే!

ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ నుంచి ఇటీవల సరైన చిత్రాలు రాలేదు. అఖిల్, ఇంటెలిజెంట్ లాంటి చిత్రాలు తీవ్రంగా నిరాశపరిచాయి. మధ్యలో వచ్చిన ఖైదీ నెం 150 చిత్రం మెగాస్టార్ మానియాతో విజయం సాధించింది. ఇప్పుడు వినాయక్ కు సరైన అవకాశాలు లేవు. బాలయ్యతో ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుకు వివి వినాయక్ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ బాలయ్య తదుపరి చిత్రం బోయపాటి దర్శకత్వంలో ఉండబోతుండడంతో వివి వినాయక్ చిత్రం ఆలస్యం అయ్యేలా ఉంది. తాజాగా వివి వినాయక్ వ్యాపారాల గురించి ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి.

 వైజాగ్‌లో విమాక్స్

వైజాగ్‌లో విమాక్స్

వివి వినాయక్ దర్శకుడిగా మంచి ఫామ్ లో ఉన్న సమయంలో థియేటర్ బిజినెస్ ప్రారంభించారు. వైజాగ్ లో పాతబడిని థియేటర్ ని కొనుగోలు చేసి కొనుగోలు చేసి అత్యాధునికమైన హంగులతో రీమోడలింగ్ చేశాడు. ఆ థియేటర్స్ ని విమాక్స్ గా మార్చేశారు. తక్కువ సమయంలోనే విమాక్స్ వైజాగ్ లో బాగా పాపులర్ అయింది. ఇదిలా ఉండగా ఈ థియేటర్ గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి.

కూల్చివేత త్వరలో

కూల్చివేత త్వరలో

ఈ థియేటర్ త్వరలో కూల్చివేతకు గురికాబడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం ఇటీవల వివి వినాయక్ ఆ థియేటర్ ని ఓ కార్పొరేట్ సంస్థకు అమ్మేశారట. విమాక్స్ స్థానంలో భారీ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేయబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే థియేటర్ ని కూల్చివేసి పనులు ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. వివి వినాయక్ ఆర్థిక సమస్యలతో ఉండడం వలనే థియేటర్ ని అమ్మేసినట్లు తెలుస్తోంది.

అందులో వాస్తవం లేదు

అందులో వాస్తవం లేదు

వివి వినాయక్ ఆర్థిక సమస్యల్లో ఉన్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మంచి ధర పలకడం వలనే విమాక్స్ ని అమ్మేసినట్లు తెలుస్తోంది. వివి వినాయక్ తన కెరీర్ లో చాలా మంది స్టార్ హీరోలకు సూపర్ హిట్ చిత్రాలు అందించారు. చాలా మంది సినీ హీరోలు, దర్శకుల ఇతర వ్యాపారాలు కూడా చేస్తున్న సంగతి తెలిసిందే.

కమర్షియల్ చిత్రాలకు మారుపేరు

కమర్షియల్ చిత్రాలకు మారుపేరు

వివి వినాయక్ కమర్షియల్ చిత్రాలకు మారుపేరు. అందుకే ఆయన ఫామ్ లో ఉన్న సమయంలో వినాయక్ దర్శకత్వంలో నటించేందుకు హీరోలు ఆసక్తి చూపేవారు. దిల్, ఠాగూర్, లక్ష్మి, ఆది లాంటి సూపర్ హిట్ చిత్రాలు వివి వినాయక్ కెరీర్ లో ఉన్నాయి. బాలయ్యతో సినిమా చేసేందుకు వినాయక్ గట్టిగ ప్రయత్నాలు చేస్తున్నారట. బోయపాటి, బాలయ్య చిత్రం పూర్తయ్యాక వినాయక్ దర్శత్వంలో చిత్రం గురించి క్లారిటీ వచ్చే అవకావం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X