twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇక నుంచి ఆన్ లైన్లో వివి వినాయిక్

    By Srikanya
    |

    హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు వివి వినాయిక్ తన పుట్టిన రోజు సందర్బంగా మంగళవారం తన పేరున ఓ వెబ్ సైట్ ని vvvinayakonline.com పేరున ఏర్పాటు చేసుకున్నారు. వినాయిక్ కుమారుడు కుందన్ కృష్ణ,కుమార్తె హాసిని కృష్ణ ఈ వెబ్ సైట్ ని ప్రారంభించారు. వినాయిక్ చెందిన సినిమా వివరాలు,విశేషాలు ఈ వెబ్ సైట్ లో పొందుపరిచారు. ప్రస్తుతం వివి వినాయిక్,రామ్ చరణ్ కాంబినేషన్ లో నాయక్ అనే చిత్రం రూపొందుతోంది.

    'నాయక్‌'. 'ది లీడర్' అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ చిత్రానికి కాజల్‌, అమలాపాల్‌ హీరోయిన్లు గా చేస్తున్నారు . ఈ చిత్రంలో రామ్ చరణ్ పాత్ర డిఫెరెంట్ గా,ద్వి పాత్రలతో ఉండనుంది. ఇందులో రామ్ చరణ్ క్యారక్టర్ సమాజానికి ఉపయోగపడేలా ఉంటుంది. రామ్ చరణ్ ని అన్యాయాన్ని ఎదిరించే యువకుడిగా చూపిస్తున్నారు. గతంలో రామ్ చరణ్ తండ్రి చిరంజీవి చిత్రాలలో కూడా హీరో ..సమాజంలో జరిగే అన్యాయాలను ఎదురించి పోరాడే వాడు. అదే స్టైల్ లో రామ్ చరణ్ కూడా మెగాభిమానులను అలరించనున్నారు.

    వినాయిక్ మాట్లాడుతూ.. ''సందేశాన్ని కూడా వినోదం మేళవించి చెప్పినప్పుడే రక్తికడుతుంది. అదీ జనాదరణ ఉన్న హీరోతో చెప్పిస్తే ఎక్కువమందికి చేరుతుంది. చిరంజీవి రక్తదానం గురించి చెప్పారు కాబట్టే అవగాహన ఏర్పడింది. కాబట్టి మనం ప్రేక్షకులకు మంచి విషయం చెప్పాలనుకొన్నప్పుడు ఓ స్టార్‌ ద్వారా అతని ఇమేజ్‌కి తగ్గ కథలో మేళవించి చెప్పాలి. ఎక్కడా వాణిజ్య విలువలు వదులుకోకూడదు. ఇప్పుడు రామ్‌చరణ్‌ చిత్రంలో అంతర్లీనంగా కొన్ని విషయాలు చెప్పబోతున్నాము''అన్నారు.

    ఈ చిత్రంలో కథ... తండ్రికిచ్చిన మాట కోసం తనయుడు ఏం చేశాడనే పాయింట్ చుట్టూ తిరుగుతుంది. చిన్నపాటి టెన్షన్ తోపాటు మంచి యాక్షన్‌ సీన్స్ ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ ఏ మాత్రం తగ్గని సినిమా. చిరంజీవిగారితో 'ఠాగూర్‌' తీసిన రోజులు గుర్తొస్తున్నాయి. తప్పకుండా అందరినీ మెప్పించే సినిమా తీస్తున్నామని దర్శకుడు వినాయక్‌ అన్నారు. నిర్మాత ఈ చిత్రం గురించి మాట్లాడుతూ... చరణ్‌ని ఒక కొత్త తరహా పాత్రలో చూపెట్టబోతున్నారు అన్నారు.

    English summary
    Filmmaker V.V.Vinayak is celebrated his birthday yesterday and on the occasion he started his own website.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X