అల్లు అర్జున్ 'బహుమతి'?
గతంలో అల్లు అర్జున్ కి బన్నీ వంటి సూపర్ హిట్ చిత్రం ఇచ్చిన వి.వి.వినాయక్ దర్సకత్వంలో మరో చిత్రం ప్రారంభం కానుండటం అభిమానులుకు ఆనందం కల్గిస్తోంది. ఎన్టీఆర్ తో వినాయక్ తెరకెక్కిస్తున్న చిత్రం పూర్తవగానే అల్లు అర్జున్ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళతారు. ఇప్పటికే మూడు చిత్రాల్లో నటిస్తూ..తీరిక లేకుండా ఉన్న అర్జున్ ఈ ఏడాది అత్యధిక చిత్రాల్లో నటించిన కథానాయకుడిగా గుర్తింపు సంపాదించారు. సుకుమార్ దర్శకత్వంలో 'ఆర్య-2' సినిమాలో నటిస్తున్నారు. మరోపక్క క్రిష్ రూపొందిస్తున్న మల్టీస్టారర్ చిత్రం 'వేదం'లో మంచు మనోజ్‌తోపాటు వెండితెరను పంచుకొంటున్నారు. అలాగే గుణశేఖర్ దర్శకత్వంలోనూ ఓ చిత్రంలో నటిస్తున్నారు.తాజా చిత్రానికి అల్లు అరవింద్ నిర్మాత. ఈ ఏడాదే ఈ సినిమా ప్రారంభించాలనుకుంటున్నారు. నవంబర్ లో సెట్స్ మీదకు వెళ్ళే ఈ చిత్రానికి బహుమతి అనే టైటిల్ పెట్టె అవకాసం ఉందని సమాచారం. ఇంతకుముందు బహుమతి టైటిల్ తో ఎస్వి కృష్ణా రెడ్డి ఓ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











