వివి వినాయక్ న్యూ ఆలోచన: సంపాదన కోసం ఆ రూట్లో...
హైదరాబాద్: ఈ మధ్య పలువురు దర్శకులు, నటులు నిర్మాతల అవతారం ఎత్తుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ లిస్టులో ప్రముఖ దర్శకుడు వి వినాయక్ కూడా చేరబోతున్నారు. త్వరలో ఓ సినీ నిర్మాణ సంస్థను స్థాపించబోతున్నారు. కొత్త టాలెంటును ఎంకరేజ్ చేయడానికే తాను సినీ నిర్మాణం వైపు అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు వివి వినాయక్.
అయితే వివి వినాయక్ సొంత నిర్మాణ సంస్థ మొదలు కావడానికి మరో సంవత్సర కాలం పట్టే అవకాశం ఉంది. తొలుత ఈ బ్యానర్లో చిన్న సినిమాలు నిర్మించాలనే యోచనలో ఉన్నారు వినాయక్. కొత్త దర్శకులు, కొత్త నటీనటులకు అవకాశాల కల్పిండమే లక్ష్యంగా ఈ ప్రొడక్షన్ పని చేయనుందని తెలుస్తోంది.

వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అల్లుడు శీను' ఈ నెల 25న విడుదల అవుతోంది. ఈ నేపథ్యంలో ఆయన సినిమా ప్రమోషన్లలో బిజీగా గడుపుతున్నారు. మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాకు సంబంధించిన విషయాలు, తన భవిష్యత్ ప్రాజెక్టుల గురించి వెల్లడించారు. తనకు 'ఆది' సినిమా చేసే అవకాశం ఇచ్చి లైఫ్ ఇచ్చిన బెల్లంకొండ సురేష్ కోసమే 'అల్లుడు శ్రీను' సినిమా చేసినట్లు వివి వినాయక్ చెప్పుకొచ్చారు.
సాయిశ్రీనివాస్ కొత్త నటుడే అయినప్పటికీ చాలా బాగా చేసాడని, సినిమాలో అతని నటన, పెర్ఫార్మెన్స్, అందరినీ ఆకట్టుకుంటుందని......సమంత హీరోయిన్‌గా నటించడం, తమన్నా స్పెషల్ సాంగ్ చేయడం సినిమాకు మరింత ప్లస్సవుతుందని, ఈ చిత్రం అన్ని వర్గాల వారికి తప్పకుండా ఆకట్టుకుంటుందని, నిర్మాతకు పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందని వినాయక్ చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











