చిరంజీవి వల్ల....వివి వినాయక్ నష్టపోతున్నాడా?

By Bojja Kumar

హైదరాబాద్: తన తోటి దర్శకులంతా వరుస సినిమాల చేస్తూ దసుకెలుతుంటే....దర్శకుడు వివి వినాయక్ మాత్రం చాలా రోజులుగా ఒకే సినిమాతో నత్త నడక సాగిస్తున్నారు. ఆయన దర్శకత్వంలో 'అల్లుడు శీను' చిత్రం విడుదలకు సిద్ధమైనా.....వివి వినాయక్ అడులుగు మాత్రం మరో ప్రాజెక్టు వైపు పడటం లేదు.

ఇందుకు సంబంధించి ఫిల్మ్ నగర్ నుండి పలు ఆసక్తికర విషయాలు వినిపిస్తున్నాయి. చిరంజీవి 150వ సినిమా చేసే అవకాశం వస్తుందనే ఆశతోనే వినాయక్ వేరే ప్రాజెక్టుల వైపు దృష్టి సారించడం లేదని తెలుస్తోంది. వేరే ప్రాజెక్టుకు కమిటైతే చిరంజీవి సినిమా చేజారి పోవచ్చే ఆత్మరక్షణలో ఉన్నారట వినాయక్. అందుకే 'అల్లుడు శ్రీను' షూటింగ్ పూర్తయి విడుదలకు సిద్దమైనా...వేరే ప్రాజెక్టుల జోలికి వెళ్లడం లేదట.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వివి వినాయక్ మాట్లాడుతూ...'నా 150వ సినిమాకు వినాయక్ దర్శకత్వం వహిస్తాడు' అని అన్నయ్య ఎప్పుడో అన్నారు. అయితే ఈ సినిమా విషయంలో ఇంకా స్పష్టత లేదు. నా దగ్గర కథలు రెడీగా ఉన్నాయి కానీ...అన్నయ్య నుండి గ్రీన్ సిగ్నల్ రావాలి' అని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు బట్టి మెగాస్టార్ 150వ సినిమా కోసం ఎదురు చూస్తున్నట్లు స్పష్టమవుతోంది. అయితే వినాయక్ సన్ని హితులు మాత్రం ఇలా చేయడం వల్ల వివి వినాయక్ ఎంతో విలువైన సమయాన్ని నష్టపోతున్నాడని అంటున్నారు.

వివి వినాయక్

వివి వినాయక్

చిరంజీవి 150వ సినిమా కోసం చాలా కథలు పరిశీలిస్తున్నారు. బెస్ట్ కథ కోసం అన్వేషణ సాగుతోంది. కథల విషయంలో చిరంజీవి బెస్ట్ జడ్జ్. కథలు, డైరెక్టర్స్, ఇతర టెక్నీషియన్స్ విషయాల్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఆలోచిస్తున్నారు. అందులో నేనూ ఒకడిని. ఏ విషయం అయినా చిరంజీవిగారే ఫైనల్ చేస్తారు అని వివి వినాయక్ చెబుతున్నారు.

తెరపైకి బోయపాటి పేరు

తెరపైకి బోయపాటి పేరు

మరో వైపు చిరంజీవి 150వ సినిమాకు దర్శకుడు బోయపాటి శ్రీను ఖరారైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అఫీషియల్ సమాచారం మాత్రం ఇప్పటి వరకు వెలువడలేదు. అయితే రామ్ చరణ్ మాత్రం సినిమాను తానే నిర్మించబోతున్నారని, అయితే టైటిల్స్‌లో నా పేరు కాకుండా నిర్మాతగా అమ్మ (సురేఖ) పేరు ఉంటుంని స్పష్టంచేసారు.

అభిమానులు

అభిమానులు

చిరంజీవి 150వ సినిమాపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఎన్నికల్లో చిరంజీవి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ ఓటమి పాలయ్యారనే బాధకంటే....ఆయన మళ్లీ తిరిగి సినిమాలపై దృష్టి సారిస్తున్నారనే ఆనందమే అభిమానుల్లో ఎక్కువగా కనిపిస్తోంది.

చిరంజీవి 150వ సినిమా

చిరంజీవి 150వ సినిమా

చిరంజీవి 150వ సినిమాలో అన్ని అంశాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సినిమా మంచి కథాంశం, సందేశం, కమర్షియల్ ఎలిమెంట్స్ ఇలా అన్ని విషయాలు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X