ఆయనే దర్శకుడిగా లైఫ్ ఇచ్చారు: వినాయక్
తరుణ్,ఇలియానా హీరోహీరోయిన్ లు గా రూపొందనున్న సినిమా గురువారం ప్రారంభం అయింది. విజయ భాస్కర్ దర్శకత్వంలో నిర్మాత శాఖమూరి పాండురంగారావు శ్రీ లక్ష్మీదేవి ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్టోబర్ 18న అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రముఖ నిర్మాత సురేష్ బాబు క్లాప్ కొట్టగా, కెఎల్ నారాయణ కెమెరాను స్విచ్ ఆన్ చేయగా ముహూర్తపు షాట్ కు వివివినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. అంతకుముందు నిర్మాత అచ్చిరెడ్డి దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ సమర్పిస్తున్నారు.
ఈ సందర్భంగా ప్రముఖ దర్శకుడు వివివినాయక్ మాట్లాడుతూ...దర్శకుడిగా నాకు బెల్లంకొండ సురేష్ లైఫ్ ఇచ్చారు...ఆయన ఏ సినిమా తీసినా అది నా సొంత సినిమాగా భావిస్తాను...విజయభాస్కర్, తరుణ్ కాంబినేషన్ లో ఇంతకుముందు వచ్చిన నువ్వే కావాలి ఎంతటి హిట్టో అందరికీ తెలిసిందే. వారిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా కూడా ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నాను...అన్నారు. చిత్ర దర్శకుడు విజయ భాస్కర్ మాట్లాడుతూ...ఈ సినిమా యువతకు సంబంధించిన పూర్తి వినోదాత్మక చిత్రం..యువ జంటతో కిలిసి పనిచేయబోవడం సంతోషంగా ఉంద..న్నాడు.
బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ...దొంగతనాలు హాబీగా ఇద్దరు ఏంచేసారన్నదే సినిమా కథ...హాబీగా మొదలయి ఆ తరువాత ఏమైందన్నదే ఈ సినిమా సబ్జెక్ట్...అటు క్లాస్, ఇటు మాస్ మెచ్చే చిత్రంగా రూపుదిద్దుకుంటుంది...అన్నారు. నిర్మాత శాఖమూరి మాట్లాడుతూ...మిత్రుడు బెల్లంకొండ సహకారంతో ఈ సినిమా నిర్మాణానికి పూనుకున్నాను...ఈ మాసాంతం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంద...న్నారు.
ఈ సినిమాకు అబ్బూరి రవి మాటలు రాస్తుండగా, చంద్రబోస్ సాహిత్యాన్ని అందిస్తున్నారు. సంగీతాన్ని కెఎమ్ రాధాకృష్ణన్, సినిమాటోగ్రఫీ సర్వేస్ మురారి చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











