నాగార్జున రెండో కుమారుడు అఖిల్ తెరంగ్రేటం వివరాలు
అక్కినేని ఫ్యామిలీ నుంచి మరో హీరో రాబోతున్నాడు. అతనెవరో కాదు..అఖిల్. నాగార్జున రెండో కుమారుడైన అఖిల్ త్వరలో వెండి తెరను పలకరించటానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. గతంలో మహేష్ బాబు, రామ్ చరణ్ తేజ లను లాంచ్ చేసిన అశ్వనీదత్ ఈ కుర్రాడి లాంచింగ్ భాధ్యతను కూడా తీసుకున్నారు. ఈ మేరకు కథా చర్చలు జరుగుతున్నట్లు చెప్తున్నారు. అయితే దర్శకుడు ఎవరనేది ఇప్పటి వరకూ కన్ఫర్మ్ కాలేదని, ఇద్దరు సీనియర్ దర్శకులను, ఓ యవ దర్శకుడుని దృష్టిలో పెట్టుకున్నారని, వారిలో ఎవరికైనా ఈ ఆఫర్ వరించే అవకాశం ఉంది. భారీగా నిర్మించే ఈ చిత్రం శక్తి తర్వాత ఉంటుందంటున్నారు. ఎన్టీఆర్ హీరోగా నిర్మితమవుతున్న శక్తి చిత్రాన్ని మెహర్ రమేష్ డైరక్ట్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఇదే కాంబినేషన్ లో కంత్రి చిత్రం వచ్చింది. ఇక అఖల్ రాకకోసం నాగార్జున అభిమానులే కాక మిగలిన వారు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications











