Vyjayanthi Movies: చిరు 157వ సినిమాకు సరికొత్త టైటిల్, వాడడానికి వీళ్లేదంటూ వైజయంతీ మూవీస్ వార్నింగ్
Vyjayanthi Movies: మెగాస్టార్ చిరంజీవి, అందాల తార శ్రీదేవి హీరోహీరోయిన్లుగా 1990లో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రోజుల్లో లక్షల మందిని తెగ అలరించిన ఈ అద్భుతమైన చిత్రాన్ని ఇప్పటికీ ఎవరూ మరిచిపోలేదు. నేటి తరం వాళ్లు కూడా ఆ సినిమాను చూసేందుకు తెగ ఇష్ట పడుతుంటారు. అంతటి అద్భుతమైన సినిమా ఇప్పుడు తెర పైకి వచ్చింది. ఈ సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన అశ్వినీ దత్.. వైజయంతీ మూవీస్ నిర్మాణ సంస్థలో సినిమాను నిర్మించారు.
అప్పట్లే అద్భుతమైన చిత్రాలను నిర్మించిన ఈ సంస్థ ఇప్పటి జనరేషన్ కు తగ్గట్లు సినిమాలు తీయలేకపోయింది. ఈక్మరంలనే నిర్మాణాన్ని ఆపేసింది. కానీ నిర్మాత అశ్వినీ దత్ కూతుర్లు నిర్మాతలుగా మారి.. మహానటి, సీతారామం వంటి బ్లాక్ బస్టర్ హిట్టు చిత్రాలను నిర్మించారు. ఇంతటి అద్భుతమైన చిత్రాలతో మళ్లీ లైన్ లోకి వచ్చిన వైజయంతీ మూవీస్ సంస్థ.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా కల్కి అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ ఫొటో ఇటీవలే నెట్టింట వైరల్ గా మారింది.

ఈ క్రమంలోనే వైజయంతీ మూవీస్ నిర్మాతలు ఫుల్ ఫైర్ అయ్యారు. ఎవ్వరైనా సరే ఆ ఫొటోను షేర్ చేస్తే.. లీగల్ యాక్షన్ తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. సెప్టెంబర్ 21వ తేదీన ఈ నోటీసు విషయమైన ఇన్ స్టాగ్రామ్ వేదికగా పోస్టు పెట్టారు. ఇది జరిగి 20 రోజులు కూడా కాకముందే మరో అద్భుతమైన సినిమా గురించి కాపీ రైట్స్ విషయంలో లీగల్ నోటీసులు ఇస్తున్నట్లు ప్రకటించింది. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా నుంచి మాటలు, పాటలు, ఫొటోలు, డైలాగ్ లు.. ఇలా ఏ ఒక్క దాన్ని కాపీ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
అయితే సినిమా వచ్చి 30 ఏళ్లు అవుతుండగా.. వైజయంతీ మూవీస్ ఇప్పుడు ఈ పోస్ట్ చేయడంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అసలు ఎందుకు ఇలా పోస్ట్ చేశారంటూ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో ఈ విషయంపై వివరణ ఇస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి 157వ సినిమాను ఉద్దేశిస్తూనే ఈ నోటీసులు ఇచ్చినట్లు కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బింబిసార ఫేమ్ డైరెక్టర్ వశిష్ట్ దర్శకత్వంలో చిరు చేయబోతున్న సినిమాకు ముల్లోక వీరుడు అనే టైటిల్ పరిశీలనలో ఉందట.

ఈ సినిమా కాన్సెప్ట్ కూడా జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో లాగానే ఉంటుందట. ఈ విషయం తెలుసుకున్న వైజయంతీ మూవీస్ నిర్మాతలు.. ఈ లీగల్ నోటీసులు ఇచ్చినట్లు అంతా భావిస్తున్నారు. ఇందులో నిజం ఎంత ఉందనేది ఎవరికీ తెలియకపోయినప్పటికీ.. ఇదే కారణం కావచ్చని అనుకుంటున్నారు. చూడాలి మరి ఏది నిజమో, ఏది అబద్ధమో. అసలు వైజయంతీ మూవీస్ ఇలా లీగల్ నోటీసులు ఎందుకు ఇచ్చిందో.


Click it and Unblock the Notifications











