టాలీవుడ్ నిర్మాత దాసరి కిరణ్ అరెస్ట్.. వ్యూహం ప్రొడ్యూసర్ అరెస్ట్ ఎందుకంటే?

ప్రముఖ తెలుగు సినీ నిర్మాత దాసరి కిరణ్‌ను ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వచ్చిన విజయవాడ పటమట పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. వెంటనే ఆయనను విజయవాడకు తరలించారు. గతం ప్రభుత్వ హయాంలో వ్యూహం సినిమాను నిర్మించి వివాదాస్పదంగా మారారు. గత ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్‌‌‌గా కూడా పనిచేశారు. అయితే ఆయన అరెస్ట్ వెనుక కారణాల్లోకి వెళితే..

హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న దాసరి కిరణ్‌పై ఆయన బంధువు గాజుల మహేష్ చేసిన ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేశారు. రెండేళ్ల క్రితం మహేష్ నుంచి కిరణ్ 4.5 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకొన్నారు. అప్ప తీర్చమని పలుమార్లు కోరారు. చాలాసార్లు ఆయనతో సంప్రదింపులు జరిపారు. అయినా ఫలితం లేకపోయింది. కొద్ది రోజులుగా మహేష్‌కు కిరణ్ ముఖం చాటేశారు. దాంతో విజయవాడలోని కిరణ్ కార్యాలయానికి మహేష్, ఆయన భార్య వెళ్లారు.

Dasari Kiran Arrest

అయితే మహేష్ ఫ్యామిలీ అప్పు తీర్చమని కోరగా.. వారి మధ్య వాగ్వాదం జరిగింది. అయితే వారి మధ్య చేజారిపోవడం.. కిరణ్ అనుచరులు వారిపై దాడి చేయడం జరిగింది. దాదాపు మహేష్‌పై 15 మంది దాడి చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ తర్వాత ఆయన ఫిర్యాదు చేయడంతో విజయవాడ పటమట పోలీసులు స్పందించారు. ఆ ఫిర్యాదు మేరకు ఆయనను అరెస్ట్ చేసినట్టు ప్రాథమిక సమాచారం. ఈ కేసుకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

More from Filmibeat

Read more about: vyooham dasari kiran tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X