పెద్ద హిట్ అని అనను అని ఒప్పుకున్న దిల్ రాజు
తమిళంలో యావరేజ్ సినిమా 'ఈరమ్"ని తెలుగులోకి ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెచ్చి వైశాలి అనే టైటిల్ తో విడుదల చేసీన సంగతి తెలిసిందే.అయితే అది తెలుగులో మాత్రం వర్కవుట్ కాలేదు.మీడియాలో ఈ చిత్రం ప్రమేషన్ నిమిత్రం దిల్ రాజు మొదట వారం రోజలు ఓ అద్బుతం జరిగిపోయిందనే రీతిలో ఊదరకొట్టారు.అయితే అంతా ప్లాఫ్ సినిమాను మోస్తున్నాడు అంటూంటే..ఆయన కాస్త కుదుటపడి..వైశాలి- పెద్ద హిట్ అని అనను. ఫలితం మాత్రం సంతృప్తికరం.
ఓ వైవిధ్యమైన చిత్రాన్ని అందించామనే సంతృప్తి ఉంది"" అని తేల్చాడు.అలాగే ..'ఆది, సింధుమీనన్‌ల నటన, సాంకేతిక నిపుణుల పనితనం అద్భుతంగా కుదిరిన చిత్రమిది. ఈ చిత్రం తెలుగులో వెంటనే వచ్చి ఉంటే సింధు మీనన్ చాలా పెద్ద హీరోయిన్ అయ్యేది" అన్నారు.కరక్టే గానీ సింధుమీనన్ ..భద్రాచలం చిత్రం నాటి నుంచీ తెలుగులో పోరాడుతూనే ఉంది. ఆ మధ్య కృష్ణవంశీ చందమామ కాస్త పేరు వచ్చింది కానీ అది నిలబడలేదు.అలాంటిది ఈ సినిమాతో ఎలా పెద్ద హీరోయిన్ అవుతుందనేది ప్రశ్న.


Click it and Unblock the Notifications











