'వైఫ్ ఆఫ్ రామ్' ట్రైలర్.. ఉత్కంఠ పెంచేసిన మంచు లక్ష్మి!
మంచు లక్ష్మి ప్రధాన పాత్రలోనటిస్తున వైఫ్ ఆఫ్ రామ్ చిత్రం ఆసక్తిని రేకెత్తిస్తోంది. తాజగా ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. భర్త మరణానికి కారణం ఏంటి అని అన్వేషించే భార్యగా మంచి లక్ష్మి కనిపిస్తోంది. చిత్రంపై ఉత్కంఠ పెంచేలా ట్రైలర్ రూపొందించారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ట్రైలర్ చూపిన ప్రతి సన్నివేశం కొత్తగా అనిపిస్తోంది. విజయ్ ఎలకంటి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే నటిగా మంచి లక్ష్మి పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఈ చిత్రంలో ఆమె ప్రధాన పాత్రలో నటిస్తుండడంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
దీక్ష అనే మహిళ పాత్రలో మంచు లక్ష్మి నటిస్తోంది. సమాజంలో ఉన్న ఇబ్బందులన్నింటిని ఎదుర్కొని న్యాయం కోసం పోరాడే దీక్ష కథ ఇది అని మంచు లక్ష్మి సోషల్ మీడియా ద్వారా తెలిపింది. త్వరలో చిత్రం విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











