పవన్ కళ్యాణ్‌కి రైట్ డైరెక్ట్ ఎవరు?

By Bojja Kumar

హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి రైట్ డైరెక్టర్ ఎవరు? ఈ విషయం ఇప్పుడు రచయిత కోన వెంకట్‌కు నిద్రలేకుండా చేస్తోంది. కోన వెంకట్ ఇప్పటి వరకు చాలా మంది టాప్ డైరెక్టర్లతో పని చేశాడు. రామ్ గోపాల్ వర్మ, పూరి జగన్నాథ్, శ్రీను వైట్ల ఇంకా అనేక మంది పని తీరును చాలా దగ్గరగా గమనించాడు. కానీ కోన వెంకట్ ఇంకా ఓ నిర్ణయానికి రాలేకపోతున్నాడు.

అసలు విషయంలోకి వెళితే...పవర్ స్టార్ కోసం వెంకట్ మంచి కథ సిద్ధం చేశారు. ఇటీవల పలు సందర్భాల్లో పవన్‌ని కలిసి స్టోరీ డిస్కస్ చేశాడు. పవన్ కూడా ఆ కథ పట్ల సుముఖంగానే ఉన్నాడు. దీని గురించి కోన వెంకట్ తాజాగా తన ట్విట్టర్లో వివరిస్తూ...'పవన్ కళ్యాణ్ తో నా స్టోరీ చర్చలు జరుగుతున్నాయి. ఆ కథను డైరెక్ట్ చేయగల రైట్ డైరెక్టర్ కోసం ఎదురు చూస్తున్నా' అని వెల్లడించారు.

ఫన్ అండ్ యాక్షన్ గా సాగే ఈ స్క్రిప్టు విషయమై కోన వెంకట్ కొన్ని రోజుల క్రితం ట్విట్టర్లో స్పందిస్తూ...దీన్ని శ్రీను వైట్ల అయితే పర్ ఫెక్టుగా తెరకెక్కిస్తాడని నా నమ్మం. ఈ కథ మొత్తం ఫన్ అండ్ యాక్షన్ తో కూడుకుని ఉంటుంది'' అని చెప్పుకొచ్చారు. మరి చివరకు ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి.

పవన్ కళ్యాణ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రానికి కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈచిత్రంలో పవన్ సరసన తమన్నా హీరోయిన్. ఇందులో పవర్ స్టార్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా కనిపించనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X