Don't Miss!
- News
అత్యాచారం కేసులో ఆశారాం బాపూను దోషిగా తేల్చిన గుజరాత్ కోర్టు
- Sports
IND vs NZ: స్టన్నింగ్ డెలివరీతో షేన్ వార్న్‌ను గుర్తు చేసిన కుల్దీప్ యాదవ్వీడియో
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- Finance
household income: భారతీయ కుటుంబాలపై సర్వే.. ఆదాయం, పొదుపులు ఎంతో తెలుసా ?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Automobiles
భారతీయ మార్కెట్లో Hero XOOM ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ప్రైస్, వేరియంట్స్ & కలర్ ఆప్సన్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
Waltair Veerayya డబుల్ బ్లాక్‌బస్టర్ అని బాస్ మెసేజ్.. థియేటర్ల సమస్యపై నిర్మాత ఘాటుగా కౌంటర్
మెగాస్టార్ చిరంజీవి, బాబీ కొల్లి కాంబినేషన్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నది.
ఇదే సమయంలో తమిళ హీరోలు అజిత్ నటించిన తెగింపు, విజయ్ నటించిన వారసుడు, బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. దాంతో వాల్తేరు వీరయ్య సినిమాకు థియేటర్ల లభించవనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నిర్మాత రవిశంకర్ ఘాటుగా స్పందిస్తూ..

థియేటర్ల సమస్యపై నిర్మాత
థియేటర్ల గురించి అసలు ఆలోచించకండి. ఎలాంటి పరిస్థితుల్లో అభిమానులు ఆందోళన చెందవద్దు. థియేటర్లను ఎన్ని ఓపెన్ చేయాలో అన్నీ చేసేస్తాం. వాటి గురించి మీరు ఎలాంటి టెన్షన్ పడవద్దు. వాల్తేర్ వీరయ్య సినిమాను ఎన్ని థియేటర్లు లభిస్తే.. అన్ని థియేటర్లలో వేస్తాం. దాని గురించి ఆలోచించకండి అని నిర్మాత రవి శంకర్ అన్నారు.

చిరంజీవి సినిమా చూసి మెసేజ్ ఇలా
రెండు రోజుల క్రితం బాస్ (చిరంజీవి) సినిమా చూశాడు. సినిమా చూసిన వెంటనే నాకు మెసేజ్ పెట్టాడు. వాల్తేర్ వీరయ్య కన్ఫార్మ్‌గా హిట్. అడ్వాన్స్ కంగ్రాట్స్. మీ ప్రేమకు, అప్యాయతకు నా ధన్యవాదాలు అని చిరంజీవి మెసేజ్ పెట్టారని నిర్మాత రవి శంకర్ ఫోన్‌లో వాట్సప్ మెసేజ్‌ను చూపించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా ఊర్లో ఎలాంటి చిన్న ప్రాబ్లెం వచ్చినా మేము చాలా జాగ్రత్తగా డీల్ చేస్తామని అన్నారు.

వాల్తేరు వీరయ్య నెల రోజులు ఆడే మూవీ
గతంలో సంక్రాంతి పండుగ సీజన్‌లో అల వైకుంఠపురంలో, సరిలేరు నీకెవ్వరు సినిమా విషయంలో థియేటర్ల విషయంలో ఇలాంటి రాద్దాంతమే జరిగింది. అలా వైకుంఠపురంలో సినిమా తర్వాత రిలీజైనా.. ఆ సినిమా బ్లాక్‌బాస్టర్ అయింది. అయితే చిరంజీవి పెట్టిన మెసేజ్‌తో ఈ సినిమా రేంజ్ ఏంటో తెలిసిపోయింది. వాల్తేరు వీరయ్య ఒక్కరోజు ఆడే సినిమా కాదు. నెల రోజులు ఆడే సినిమా అని నిర్మాత రవిశంకర్ ధీమా వ్యక్తం చేశారు.

మీ సపోర్టు కావాలి..
టాలీవుడ్‌లో ఎన్నడూ లేని విధంగా వాల్తేరు వీరయ్య రికార్డులు క్రియేట్ చేస్తుంది. నెల రోజులు ఆడే సినిమాతో బాస్, మేము మీ ముందుకు వస్తున్నాం. కాబట్టి మీ సపోర్ట్ కావాలి. మీరు ఫస్ట్ డే గురించే మీ ఫోకస్. దాన్ని మాకు వదలేయండి. మాగ్జిమమ్ న్యాయం జరుగుతుంది. మీరు ఎలాంటి టెన్షన్ పడొద్దు అని నిర్మాత రవిశంకర్ చెప్పారు.

మోడరన్ ఇంద్రగా వాల్తేరు వీరయ్య
వాల్తేర్ వీరయ్య ఈ మధ్యకాలంలో వచ్చిన అతిపెద్ద కమర్షియల్ సినిమా. చాలా కంటెంట్ ఉంది. థియేటర్ ఇష్యూ అసలు ఉండదు. ఖైదీకి పలుమార్ల రెట్టింపు విజయం సాధించే సినిమా. వాల్తేర్ వీరయ్య సినిమా మోడరన్ ఇంద్ర మాదిరిగా ఉంటుంది. ఈ సినిమాకు రిపీట్ ఆడియెన్స్ వాల్యూ ఉంటుంది. కాబట్టి మీరు సినిమాను ఎలా ఎంజాయ్ చేయాలో అనే విషయాన్ని ఆలోచించండి అని రవి శంకర్ అన్నారు.