పవర్ స్టార్ తో పేచీకి రెడీ అంటోన్న హిప్పీ భామ...
టాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెట్టే ప్రతి అమ్మాయి పవర్ స్టార్ తో కలసి నటించాలనే కోరుకుంటుంది. కానీ, ఆ అదృష్టం కొద్ది మందికి మాత్రమే లభిస్తుందన్నది వాస్తవం. అయితే ఏ హీరోయిన్ అయినా, పవన్ కల్యాణ్ తో రొమాన్స్ చేయాలనే కోరుకుంటుంది. కానీ, దీనికి భిన్నంగా హిప్పీ భామ మాత్రం పవర్ స్టార్ తో కయ్యానికి కాలుదువ్వాలని ఉందంటూ వయ్యారాలు పోతోంది.
RX 100 కార్తికేయ హీరోగా నటించిన హిప్పీ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన దిగంగనా సూర్యవంశీ, ప్రస్తుతం సీటీమార్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో గోపీచంద్, తమన్నా నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో మీడియాతో ముచ్చటించిన దిగంగన, పవర్ స్టార్ తో కలసి నటిస్తే తన జీవితమే ధన్యమైపోతుందన్నంత బిల్డప్ ఇచ్చేస్తోంది.

పవన్ కల్యాణ్ ఓ విలక్షణ నటుడు అని పొగిడేస్తున్న దిగంగన, ప్రజలతో ఆయన మమేకమయ్యే తీరుపై ప్రశంసలు కురిపించేస్తోంది. పవర్ స్టార్ అన్న టైటిల్ ఆయనకు మాత్రమే సరిపోతుందంటూ మురిసిపోతోంది. ఇక అలాంటి లెజెండ్ తో కలసి నటించాలని ఉందంటూ మనసులోని మాటను బయటపెట్టేసింది. అయితే, పవర్ స్టార్ తో రొమాన్స్ కన్నా ఓ హై ఆక్టేన్ యాక్షన్ సీన్ లో నటించాలన్నది అమ్మడి కోరిక అట. ఇలాంటి వింత కోరిక కలగడం ఇదే మొదటిసారి అనుకుంటా. ఏమైనా సీటీమార్ సక్సెస్ అయితే, అమ్మడి ముచ్చట తీరేందుకు మార్గం సుగమం అవుతుందేమో! అదీ చూడాలి.
digangana suryavanshi power star pavan kalyan hippi vakeel saab పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హిప్పీ వకీల్ సాబ్


Click it and Unblock the Notifications