twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిఖిల్ ‘శంకరాభరణం’ లో మీకు నటించాలని ఉందా

    By Srikanya
    |

    హైదరాబాద్: ‘సూర్య వర్సెస్ సూర్య' చిత్రంతో హ్యాట్రిక్ విజయాలు అందుకున్న యంగ్ హీరో నిఖిల్ తాజాగా మరో కొత్త ప్రాజెక్టు చేయడానికి సిద్ధమయ్యాడు. వైవిధ్యభరితమైన టైటిల్ ‘శంకరాభరణం' చిత్రంలో నటించనున్నాడు. ఈ చిత్రాన్ని కోన వెంకట్ నిర్మిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం నటీనటులు కోసం కాస్టింగ్ కాల్ ఇచ్చారు. 18 నుంచి 25 సంవత్సరాల లోపు అమ్మాయిలు, అబ్బాయిలు కావాలని తెలియచేసారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    కోన వెంకట్ ట్వీట్ చేస్తూ ఈ విషయాన్ని తెలియచేసారు. తాము రూపొందిస్తున్న క్రైమ్ కామెడీ శంకరా భరణం కు... మినిమం రెండు షార్ట్ ఫిలిలు చేసిన లేదా ఓ ఫీచర్ ఫిల్మ్ చేసిన వారు కావాలని అన్నారు. వారు తమ వర్క్...కేవలం రెండు నిముషాలు పంపమన్నారు. షార్ట్ ఫిలిలు మొత్తం పంపవద్దని చెప్పారు. వాళ్లలో కొందరిని షార్ట్ లిస్ట్ చేసి, వాళ్లని ఆడిషన్స్ కు పిలుస్తామని చెప్పారు.

    మీ వీడియోలు పంపాల్సిన ఎడ్రస్ .. [email protected]

    అలాగే తనకు పర్సనల్ గా ఎవరూ మెయిల్స్,మెసేజ్ లు పంపవద్దని కోరారు.

    కొత్త దర్శకుడైన ఉదయ్ నందనవనం ఈ చిత్రాన్ని దర్శకత్వం వహిస్తాడని సమాచారం. ఈ చిత్రానికి కథ, మాటలు కోన వెంకట్ అందిస్తున్నాడు. ప్రవీణ్ లక్కరాజు ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇదో క్రైమ్ కామెడీ చిత్రంగా రూపొందనుందని ఫిలింనగర్ సమాచారం.

    want to act in Nikil's Shakarabharanam movie?

    ఇంతకుముందు కోన వెంకట్..అంజలి ప్రధాన పాత్రలో గీతాంజలి అనే హర్రర్ కామెడీని నిర్మించి హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం కూడా అన్ని రకాల ఎలిమెంట్ లతో డిఫెరెంట్ గా సాగుతుందని చెప్తున్నారు. ‘ శంకరాభరణం' : కోన వెంకట్-నిఖిల్ కాంబినేషన్ లో... ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో సక్సెస్ ఫుల్ రైటర్ గా కెరీర్ సాగిస్తున్న రచయితల్లో కోన వెంకట్ ఒకరు.

    ఆయన ఏ సినిమాకు పని చేసినా.....ఆ సినిమా బాగా ఆడుతుందనే పేరు ఉంది. ఆయన రాసే డైలాగ్స్, స్క్రీన్ ప్లే కోసం పలువురు దర్శకులు, హీరోలు ఎదురు చస్తారంటే ఆయనకున్న డిమాండ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. నిఖిల్ కోసం కథను ప్రస్తుతం తయారు చేసినట్లు తెలుస్తోంది. నిఖిల్ బాడీ లాంగ్వేజికి తగిన విధంగా కోన వెంకట్ కథ తయారు చేసారని అంటున్నారు.

    పూర్తి వినోదాత్మకంగా సాగే కమర్షియల్ ఎంటర్టెనర్ గా ఉంటూనేై క్రైమ్ ఎలిమెంట్ ఈ చిత్రంలో ఉండనుంది. సినిమాలో బ్రహ్మానందం కీలక పాత్రలో నటిస్తానరి తెలుస్తోంది. ఆయన కోసం కోన వెంకట్ స్పెషల్ క్యారెక్టర్ క్రియేుట్ చేసినట్లు తెలుస్తోంది. కధల ఎంపికలో నిఖిల్ చాలా జాగ్రత్తలు వహిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

    'కార్తికేయ' సినిమా విజయంతో మంచి డిమాండులోకి వచ్చిన నిఖిల్ ప్రస్తుతం 'సూర్య వెర్సస్ సూర్య' అనే సినిమాలో నటించాడు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందిన‘సూర్య వర్సెస్ సూర్య' భాక్సాఫీస్ వద్ద అనుకున్న విధంగా వర్కవుట్ కాలేదు. గతంలో పలు చిత్రాలకు కెమెరామెన్ గా పనిచేసిన కార్తీక్ ఘట్టమనేని డైరెక్టర్ గా పరిచయం అయ్యారు.

    English summary
    Venkat Kona tweeted: " Looking for young talent between 18-25 yrs boys/girls for our forthcoming film "SHANKARA BHARANAM"- Crime Comedy. Interested youngsters should have done at least two short films or one feature film. Pl send a 2 minute edit of ur work (full length short films will not be watched). Short listed people will be called for auditions. Pl mail Ur videos to shankarabharanamcinemagmail.com .. Pl don't send any personal msgd in this regard.. Thank u friends"
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X