అక్కడా అన్నపూర్ణ స్టూడియో కడతాం: నాగ్
"భవిష్యత్తులో సినీ పరిశ్రమకు గమ్యం విశాఖపట్నం అవుతుంది...త్వరలో అన్నపూర్ణ స్టూడియోని వైజాగ్ లో కట్టే అవకాశముంద"ని నాగార్జున ప్రకటించారు. ఆయన తాజా చిత్రం 'రాజన్న'ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే ..చెన్నై నుంచి చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌కు తరలి రావడానికి 15-20 ఏళ్లు పట్టింది. ఇప్పటికీ ఇక్కడ షూటింగులకు అనుమతులు అంత తేలిగ్గా లభించడం లేదు. విశాఖ షిప్‌యార్డులో షూటింగుకు అనుమతి లభించకపోతే చెన్నై వెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. భీమిలిలోనూ ఇలాంటి సమస్యే ఎదురైంది. ఈ విషయంలో కొంచెం వెసులుబాటు ఇస్తే... విశాఖపట్నం, అరకు, భీమిలి వంటి ప్రదేశాల్లో ఇంకా ఎక్కువ సినిమా షూటింగులు జరుగుతాయ అన్నారు అక్కినేని నాగార్జున.
ఇక ఇతర దేశాల్లో సినిమాలుకు తేలిగ్గా అనుమతలు లభిస్తున్నాయంటూ..థాయ్‌లాండ్‌లో చిత్రీకరణకు అనుమతి లభించాలంటే అరగంట చాలు. ఈ విధానం మనం కూడా పాటిస్తే మంచి ఫలితాలొస్తాయి. విశాఖ, అరకు ప్రాంతాల్లో అందాలకు కొదవ లేదు. కానీ ఇంకొన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి. అవన్నీ సమకూరితే అన్నపూర్ణ స్టూడియోని ఇక్కడ కూడా నిర్మించే ఆస్కారం ఉంది. స్టూడియో నిర్మాణానికి కేవలం స్థలం ఇస్తే సరిపోదు. ఇతర వసతులూ సమకూర్చాలి. చిత్రపరిశ్రమను ప్రోత్సహించాలంటే అనుమతులు సత్వరం ఇవ్వాలి. నిర్ణీత రుసుములు చెల్లించడానికి నిర్మాతలంతా సిద్ధమే. భవిష్యత్తులో సినీ పరిశ్రమకు గమ్యం విశాఖపట్నం అవుతుందని అన్నారు. ఇక ప్రస్తుతం ఆయన తన తాజా చిత్రం ఢమురకం షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఆ చిత్రం మార్చి 27న ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశముందని నాగార్జున తెలిపారు.


Click it and Unblock the Notifications











