నా పాత్రలో సల్మాన్‌ లేదా అక్షయ్‌

By Srikanya

న్యూఢిల్లీ: ఇప్పుడు బయోపిక్ లు బాలీవుడ్ ని ఏలుతున్నాయి. ఈ నేపధ్యంలో తన జీవిత కథను సినిమాగా తీయాల్సి వస్తే.. తన పాత్రను సల్మాన్‌ ఖాన్‌ లేదా అక్షయ్‌కుమార్‌ పోషిస్తే బాగుంటుందని రెజ్లర్‌ యోగేశ్వర్‌ దత్‌ అభిప్రాయపడ్డాడు. ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచి స్వదేశం చేరిన దత్‌.. ఓ టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలవడమే తన తర్వాతి లక్ష్యమని అన్నాడు.

''రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో తప్ప అన్ని ప్రధాన టోర్నీల్లో పతకాలు సాధించా. వచ్చే ఏడాది ఈ టోర్నీలోనూ పసిడి గెలవాలనేది నా కోరిక. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పతకం సాధిస్తే ఒలింపిక్స్‌కు బెర్త్‌ దొరుకుతుంది. కొత్తగా 65 కేజీల విభాగంలోకి మారిన తర్వాత బాగా కలిసొస్తోంది.

Want Salman or Akshay to Play Me: Yogeshwar Dutt

ఇటలీలో జరిగిన అంతర్జాతీయ రెజ్లింగ్‌ టోర్నీతో పాటు కామన్వెల్త్‌ క్రీడలు, ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించా. కొత్త కేటగిరి నా ప్రదర్శనకు బాగా సరిపోయింది. ఇటలీ టోర్నీలో ప్రపంచ ఛాంపియన్‌ను కూడా ఓడించా. ఇక కామన్వెల్త్‌ క్రీడల్లో ఏ బౌట్‌ రెండు నిమిషాలకు మించలేదు'' అని యోగేశ్వర్‌ చెప్పాడు. ఆసియా క్రీడల రెజ్లింగ్‌లో యోగేశ్వర్‌ 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత్‌కు పసిడి పతకం సాధించిపెట్టాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X