సెక్సీ సమంత...చిన్నతనంలో ఎంతో క్యూట్‌గా..(ఫోటోలు)
హైదరాబాద్ : సినీ రంగంలోకి అడుగు పెట్టిన కొద్ది కాలంలోనే బాగా పాపులర్ అయి టాప్ హీరోయిన్‌గా ఎదిగిన వారిలో హీరోయిన్ సమంత ఒకరు. సమంత తాజాగా తన చిన్ననాటి ఫోటోలను ట్విట్టర్ ద్వారా విడుదల చేసింది. సమంత ఇప్పుడు ఎంత సెక్సీగా ఉందో... అప్పుడు అంత క్యూట్ ఉంది.
తన తాజా సినిమా 'ఎటో వెళ్లి పోయింది మనసు' చిత్రం ఈ శుక్రవారం విడుదలవుతున్న నేపథ్యంలో సమంత తన చిన్న నాటి ఫోటోలు విడుదల చేయడం విశేషం. తన సినిమా విడుదల నేపథ్యంలో ప్రేక్షకుల ఆశీర్వాదం కోసమే సమంత ఈ ఫోటోలను విడుదల చేసినట్లు చర్చించుకుంటున్నారు.
'ఈ ఫోటోలు ఇటీవల మా అమ్మ వెతికి మరీ పట్టుకుంది' అంటూ సమంత ట్విట్టర్లో పేర్కొంది. సమంత తాజాగా పోస్టు చేసిన చైల్డ్ హుడ్ ఫోటోలతో పాటు... ఆమె ఇది వరకు ట్విట్టర్లో పోస్టు చేసిన ఫోటోలపై ఓ లుక్కేద్దాం...

సమంత 1987, ఏప్రిల్ 28న మళయాలి మదర్, తెలుగు ఫాదర్‌కు జన్మించింది. చిన్నప్పటి నుంచి చెన్నయ్ లోనే పెరిగింది. అందు వల్ల ఆమె తమిళం చాలా బాగా మాట్లాడగలదు. తన కుటుంబ నేపథ్యం తమిళనాడు కాక పోయినా...అక్కడే పుట్టి పెరగడం వల్ల తనను తాను తమిళియన్ గానే చెప్పుకుంటుంది సమంత.

సమంత తన పాఠశాల విద్యను టి నగర్లోని హోలీ ఏంజిల్స్ ఆంగ్లో-ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో పూర్తి చేసింది. చెన్నయ్ లోని స్టెల్లా మేరీ కాలేజ్ నుంచి కామర్స్ లో డిగ్రీ పొందింది.

సమంత తనకంటే పెద్దవారైన ఇద్దరు సోదరులను కలిగి ఉంది. ఒకరి పేరు డేవిడ్, మరికొరి పేరు జోనథన్ ప్రభు. జోనతన్ మీడియా ఇండస్ట్రీలో పని చేస్తుండగా, డేవిడ్ బిపిఓ సెక్టార్లో పని చేస్తున్నాడు.

ఏమాయ చేసేవె చిత్రం ద్వారా 2010లో తెరంగ్రేటం చేసిన సమంత ఈమూడు సంవత్సరాల్లో దాదాపు 12 చిత్రాల్లో నటించింది.

సమంత తెలుగు చిత్రాలు ఏమాయ చేసేవె, బృందావనం, దూకుడు, ఈగ చిత్రాలు బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ అయ్యాయి.

ఈ నెల 14న విడుదలవుతున్న ‘ఎటో వెళ్లి పోయింది మనసు' చిత్రంపై సమంత ఎన్నో అంచనాలు పెట్టుకుంది.

సమంత ప్రస్తుతుం మహేష్ బాబుతో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంతో పాటు, నాగ చైతన్యతో ‘ఆటోనగర్ సూర్య' చిత్రం చేస్తూ బిజీగా గడుపుతోంది.

ఏక్ దివానా థా చిత్రంలో గెస్ట్ రోల్ చేయడం ద్వారా బాలీవుడ్ కి పరిచయం అయిన సమంత, Assi Nabbe Poorey Sau అనే హిందీ చిత్రం ద్వారా బాలీవుడ్ అరంగ్రేటం చేసేందుకు రెడీ అవుతోంది.


Click it and Unblock the Notifications











