సీనియర్లతో అనుభవం కావాలి....హన్సిక
"చూడండి..సినిమా అనేది క్రియేటివ్ ఫీల్డ్. ఇక్కడ సీనియర్ల అనుభవం ముఖ్యమే...కొత్తవారి ప్రయోగాలూ ముఖ్యమే. నటులు అన్నవారు రెండింటిలో ఒదిగిపోయి నటించాలి అంటోంది హాట్ స్టార్ హన్సిక. ఇన్నాళ్ళు కుర్ర హీరోల సరసన మాత్రమే చేసిన ఆమెను మీరు సినిమాని ఎంచుకునేటప్పుడు ఏమి పరిగణలోకి తీసుకుంటారు అంటే..సినిమాలను అంగీకరించే విషయానికొస్తే...ఒక్కో సినిమాను అంగీకరించడానికి ఒక్కో కారణం ఉంటుంది. నా వరకు ఏ సినిమా అయినా అంగీకరించే ముందు నా పరిథి మేర జాగ్రత్త పడతాను. అయితే మన అంచనాలు అన్నిసార్లూ మంచి ఫలితాలే ఇవ్వవు కదా అంటూ నిట్టూర్చింది హన్సిక. అలాగే నాకు కొత్త దర్శకులతోనే కాకుండా సీనియర్ దర్శకులతో కూడా పనిచేయాలని ఉంటుంది అంది. ఇక చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేని ఆమె తమిళ చిత్రాలు చేస్తోంది. జయీభవ, సీతారాముల కళ్యాణం చిత్రాల ఫెయిల్యూర్స్ తర్వాత ఆమెకు సినిమాలు ఏమీ రాలేదు. అలాగే రెమ్యునేషన్ పెంచటం కూడా ఆమెను దెబ్బ తీసింది. దాంతో తాను పెద్ద హీరోల సరసన కూడా చేయటానకి రెడీ అని గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ప్రస్తుతం ఈమె ధనుష్ సరసన మాపిళ్లై చిత్రంలో చేస్తోంది.


Click it and Unblock the Notifications











