»   » ప్రభాస్ ని చేసుకోవాలంటే ఇవన్నీ తెలియాలి

ప్రభాస్ ని చేసుకోవాలంటే ఇవన్నీ తెలియాలి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: బాహుబలి ప్రభాస్‌ పెళ్లికి ఓకే అన్నారని ఆయన పెదనాన్న కృష్ణంరాజు గారు ఖరారు చేసి చెప్పారు. మరి ఇక పెళ్లి కూతురుని వెతకటమే తరువాయి. సర్లే తన ప్రెండ్ కు ఆ సాయిం చేయాలని , ఆ పనిని మొదలు పెట్టాడు ఆయన అన్న భల్లాలదేవుడు(రానా).

గురువారం రానా తన సోషల్ నెట్ వ ర్కింగ్ ఖాతా ద్వారా బాహుబలికి కావాల్సిన వధువు ఎలా ఉండాలో వర్ణిస్తూ ఓ పోస్ట్‌ చేశారు. ఇందులో బాహుబలి గుణగణాల గురించి, ఆయనకు కాబోయే భార్యకు ఉండాల్సిన అర్హతల గురించీ రాశారు. అవేంటో మీరూ చుడండి.

ఈ ప్రకటనలో ... 6.2 అడుగుల ఎత్తున్న 36 ఏళ్ల యోధుడికి వధువు కావాలని రాశారు. ఇంట్లో భారీ పనులను తానే సునాయాసంగా చేసేస్తాడు. మేకప్‌ చేసుకోగలడు.. భార్యకూ చేయగలడు అంటూ రానా తన తమ్ముడు బాహుబలి గుణగణాలను వర్ణించాడు కొంచెం అతిశయోక్తిగా.

Wanted bride for bahubali tweets rana

అంతేనా... బాహుబలికి కాబోయే భార్యకు యుద్ధ విద్యలపట్ల అవగాహన ఉండాలని , కత్తిసాము, విలువిద్య, మల్లయుద్ధం వంటి యుద్ధ రీతుల్లో బాగా పట్టు ఉండాలని రానా పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం కఠిన కారాగార శిక్ష అనుభవిస్తున్న అత్తగారిని గౌరవంగా చూసుకోవాలన్నారు.

ఇంటిపనుల్లోనే కాక యుద్ధ పన్నాగాల్లోనూ భర్తకు సహాయపడాలని, శత్రువును ఓడించడానికి కొత్త టెక్నిక్‌లు తెలియజేయాలని కూడా రాశారు.
ఈ ప్రకటనకు ఎంత స్పందన వస్తుందో, ఎవరు స్పందిస్తారో చూడాలి. ఈ విషయమై అభిమానులు సైతం సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో ఈ పోస్ట్ ని షేర్ చేస్తూ రచ్చ చేస్తున్నారు.

English summary
Rana Daggubati, who played the antagonist Bhallaladeva in Baahubali, shared a hilarious matrimonial ad for Prabhas on his Twitter timeline.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu