గోపీచంద్ తాజా ప్లాప్ 'వాంటెడ్' చిత్ర నిర్మాత పాట్లు
గోపీచంద్ తాజా చిత్రం 'వాంటెడ్' విడుదలైన రోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అయితే చిత్ర నిర్మాత వెనిగళ్ళ ఆనందప్రసాద్ మాత్రం సినిమాని నిలబెట్టాలని శత విధాల ప్రయత్నిస్తున్నారు. ఏ టీవీ ఛానెల్ చూసినా, పేపర్ లో చూసినా ఇంటర్వూలు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. అంతేగాక ఆయన ఇలాంటి హిట్ వస్తుందని ఊహించలేదంటూ స్టేట్ మెంట్ ఇస్తున్నారు. ఆయన తాజాగా ఇచ్చిన ఇంటర్వూలో... మా భవ్య క్రియేషన్స్... పేరు వింటేనే సక్సెస్ సినిమాలను తీసే సంస్థ అనే ముద్ర కనిపించాలి. అందుకోసమే ప్రయత్నిస్తున్నాం. ఇటీవల విడుదలైన 'వాంటెడ్' మా అభిలాషను నెరవేర్చింది అన్నారు.
అలాగే...వాంటెడ్‌కు కథ హైలైట్. అలాగే ప్రతి సన్నివేశం కంటికింపుగా ఉందని ప్రశంసలు వచ్చాయి. దర్శకుడు రవి కథ చెప్పగానే మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అవుతుందనుకున్నా.దర్సకుడు రవి సినిమా తీయడానికి ముందు ఏదైతే చెప్పాడో దాన్నే తీసి చూపించాడు. ఇక రాంబాబు పాత్రలో గోపీచంద్ అన్ని వర్గాల వారినీ మెప్పించాడు. ప్రేయసి కోరిక తీర్చడానికి రాంబాబు పాత్ర చేసిన రిస్కు మహిళలను ఎంతగానో మెప్పిస్తోంది. మా ఎగ్జిక్యూటివ్ నిర్మాత అన్నేరవికి ఇది మూడో సినిమా. నేను మా సిమెంట్స్ వ్యవహారాల్లోనూ, ఇతర వ్యాపారాల్లోనూ బిజీగా ఉంటే అన్నేరవి మొత్తం ప్రాజెక్ట్‌ను ముందుండి నడిపించారు అంటూ అందరిపై పొగడ్తల వర్షం కురిపించారు.


Click it and Unblock the Notifications











