For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్చ్..పవన్ కళ్యాణ్ చిత్రానికి సమస్య తప్పటం లేదు

  By Srikanya
  |

  హైదరాబాద్ : చాలా మంది హీరోల సినిమాలు ఎదుర్కొంటున్న సమస్యనే పవన్ కళ్యాణ్ సినిమా ని ఎదుర్కొంటోంది. త్వరలో త్రివిక్రమ్ తో ఆయన ప్రారంభించబోయే చిత్రానికి సెకండ్ హీరోయిన్ దొరకటం లేదు. ఓ మాదిరి హీరోయిన్స్ ని తీసుకోవటానికి ఇష్టపడటం లేదు..స్టార్ హీరోయిన్స్ తాము సెకండ్ హీరోయిన్స్ గా చేయలేమంటున్నట్లు డేట్స్ ఖాళీ లేవని తప్పించుకుంటున్నారు. దాంతో మొదట హీరోయిన్ గా సమంత ఎంపికైన ఈ చిత్రానికి సెంకడ్ హీరోయిన్ పోస్ట్ ఇంకా ఖాళీగానే ఉందని తెలుస్తోంది. ఇందుకోసం దర్శక,నిర్మాతలు విపరీతంగా వేట కొనసాగిస్తున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం.

  అందులోనూ ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావటంతో సెంకడ్ హీరోయిన్ రోల్ కీ ప్రయారిటీ ఉందని తెలుస్తోంది. దాంతో ఖచ్చితంగా బాగా పాపులర్ హీరోయిన్ అయితేనే బెస్ట్ అని భావిస్తున్నారు. ఇక ప్రస్తుతం షూటింగ్ కొత్తగా మొదలైన చిత్రాలు,కాబోతున్న చిత్రాలు చాలా వరకూ ఈ సెకండ్ హీరోయిన్ సమస్యనుంచి బయిటపడటానికి శాయిశక్తులా ప్రయత్నిస్తున్నాయి. అందులోనూ సెకండ్ హీరోయిన్ అనే సరికి బడ్జెట్ పరంగా కూడా లిమిటేషన్ ఉంటుంది.

  ఈ చిత్రం జనవరి 8 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలువుతుంది. హైదరాబాద్ లోనే ఫస్ట్ షెడ్యూల్ ప్లాన్ చేసారు. హీరో,హీరోయిన్ మధ్య కొన్ని రొమాంటిక్ సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో చిత్రీకరిస్తారని సమాచారం. పవన్-త్రివిక్రమ్ మూవీ ఓపెనింగ్ ఫంక్షన్ నవంబర్ 23 ఫిల్మ్ నగర్లో జరిగింది. ఫిల్మ్ నగర్ శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజా ఫార్మాలిటీస్ పూర్తి చేసారు. భారీ నిర్మాత బివిఎస్ ఎన్ ప్రసాద్ నిర్మాతగా, రిలియన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రెవేట్ లిమిటెడ్ పతాకంపై ఈ చిత్రం రూపొందుతుంది.

  నిర్మాత బివిఎస్ ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ... పవన్ కళ్యాణ్ గారితో సుస్వాగతం రోజుల్నించీ మంచి సినిమా చెయ్యాలన్న కోరిక ఉంది. అది ఇన్నాళ్లకు నెరవేరింది. పవన్, త్రివిక్రమ్ గార్ల కాంబినేషన్ లో ఇంత మంచి ప్రాజెక్టు చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అన్నారు.చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్, ఫొటోగ్రఫీ ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ రామ్ లక్ష్మణ్, ఆర్ట్ రవీందర్, కో ప్రొడ్యూసర్స్ భోగవల్లి బాపినీడు, రిలియన్స్ ఎంటర్టైన్మెంట్స్

  ఈ చిత్రానికి 'హరే రామ హరే కృష్ణ', 'సరదా' టైటిల్స్ పరిశీలిస్తున్నట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. అయితే త్రివిక్రమ్ మాత్రం ఈచిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదని, నేను చెప్పే వరకు ఏ వార్తను నమ్మ వద్దని ఇటీవల ఓ ఇంట్వర్యూలో తేల్చి చెప్పారు. పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్లో గతంలో జల్సా సినిమా వచ్చింది. జల్సా కలెక్షన్లను కురిపించింది. దీంతో త్రివిక్రమ్, పవన్ కాంబినేషన్‌కు సమంత తోడు కావడంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించనున్నారు.

  English summary
  Pawan Kalyan upcoming film with Trivikram Srinivas, which is tentatively titled as 'Hare Rama Hare Krishna', is all set to go to floors. But the unit is desperately in need of a heroine. Although, Samantha has been roped in as lady lead opposite Pawan, the crew is searching for the second fiddle. According to casting managers, most of the films which are in pre-production phase are buying time in zeroing second fiddles. Since, average heroines are not easily accepting roles to play as second heroine.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X