For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సోలో హీరోయిన్‌ గా నటించే అవకాశం ఇచ్చిన డైరెక్టర్‌ కి కృతజ్ఞతలు..

    By Nageswara Rao
    |

    గోపీచంద్‌, దీక్షాసేధ్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'వాంటెడ్‌'. పోస్ట్‌ప్రొడక్షన్స్‌ పనులు చురుగ్గా సాగుతున్నాయి. పూరి జగన్నాధ్ శిష్యుడు బివిఎస్‌ రవి దర్శకునిగా పరిచయం అవుతున్నాడు. వెనిగళ్ళ ఆనందప్రసాద్‌ నిర్మాత. ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ, మా భవ్య క్రియేషన్స్‌ బేనర్‌లో "శౌర్యం" అనే హిట్‌ సినిమా తర్వాత చేస్తున్న సినిమా ఇది.

    మరలా మా బేనర్‌లో హీరోగా గోపీచంద్‌తో చేస్తున్నాం. మా సంస్థలో పనిచేయడం ఆనందంగా ఉంది. ఒక సినిమా చేయాలనుకున్నప్పుడు కథ మీరే చూడండి. డేట్స్‌ ఇస్తాను అన్నారు. కథ కోసం చూస్తుండగా...పూరీజగన్నాథ్‌ రవి అనే వ్యక్తిని పంపారు. అప్పుడు గోలీమార్‌ షూటింగ్‌లో గోపీచంద్‌ ఉన్నారు. కథ నచ్చింది. సినిమా తీయాలని మూడునెలలపాటు స్క్రిప్ట్‌కు తుదిమెరుగులు దిద్దడం జరిగింది.

    గోపీచంద్‌ నిర్మాతగా అన్ని పనులు తానే చూసుకున్నాడు. నేను షూటింగ్‌ చూసుకోవడం కుదరలేదు. వ్యాపారాలతో బిజీగా ఉండడంవల్ల అన్నీ గోపీచంద్‌ చూసుకోవడం జరిగింది. ఈసినిమాలో నాజర్‌, షఫీ, సుబ్బరాజు, అలీ, చంద్రమోహన్‌, జయసుధ, ప్రకాష్‌రాజ్‌ మొదలైనవారు నటించడం జరిగింది. ఈ చిత్రాన్ని ఈనెల 26న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు.

    దీక్షాసేథ్‌ మాట్లాడుతూ ఇప్పుడిప్పుడే తెలుగు బాగా అర్థమవుతుంది. త్వరలో తెలుగు నేర్చుకుంటాను. సోలో హీరోయిన్‌‌గా నటించాను. కొత్తగా వచ్చిన నాకు హీరోయిన్‌గా అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈసినిమాకి చక్రి సంగీతం అందించడం జరిగింది. ఈసినిమాలోని అన్ని పాటలు బాగున్నాయి. 'అరకిలో పొగరు' అనే పాట నాకు బాగా నచ్చింది అని చెప్పారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X