చిరు అంతటివారు కావాలి:తేజ
దర్శకుడు తేజ ఏంచేసినా వినూత్నరీతిలో చేస్తాడు. చాన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న తేజ ఇపుడు మళ్లీ సినిమా తీయడానికి సిద్ధమవుతున్నాడు. ప్రతి సినిమాలో కొత్తవారికి అవకాశం ఇచ్చే తేజ మళ్లీ కొత్తవారితోనే సినిమా తీయడానికి రెడీ అవుతున్నాడు. ఇందుకోసం కింగ్ ఫిషర్ సూపర్ స్టార్ అనే టాలెంట్ హంట్ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ కూడా స్పాన్సర్ గా పనిచేయనున్నది. మేజర్ స్పాన్సరర్ గా కింగ్ ఫిషర్ వ్యవహరించనున్నది. ఈ వివరాలను తేజ, నిర్మాత సురేష్ బాబు వెల్లడించారు.
ఈ సందర్భంగా తేజ మాట్లాడుతూ...రాష్ట్రవ్యాప్తంగా ఎంతో మంది టాలెంట్ ఉన్నవారు ఉన్నారు...కానీ వారికి అవకాశాలు రావడంలేదు....ఎంతసేపు ఒక హీరో కొడుకో, నిర్మాత తమ్ముడో, దర్శకుడి బావమరిదో సినిమా అవకాశాలు చేజిక్కుంచుకుంటున్నారు తప్ప నిజంగా టాలెంట్ ఉన్నవారు సినిమా పరిశ్రమలోకి రాలేకపోతున్నరు..అలాంటి వారికోసమే ఈ టాలంట్ సెర్చ్...చిరంజీవి సినిమాలలోకి రాకముందు ఆయనకు ఇండస్ట్రీలో ఎవరూ తెలియదు...ఆయన తన సొంత టాలెంట్ ఆధారంగా ఇంతటివారయ్యారు...అలాంటివారు రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు..వారంతా నటించాలి చింరజీవి అంత కావాలి....అన్నాడు తేజ.


Click it and Unblock the Notifications











