twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కౌశల్ ఆర్మీ, ప్రభాస్ ఫాన్స్ మధ్య వార్.. కారణం ఇదే!

    |

    Recommended Video

    Here Is The Reason For Challenge Between Kaushal Army And Prabhas Fans

    బిగ్ బాస్2 విజేత కౌశల్ ఊహించని క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అతడికి కౌశల్ ఆర్మీ పేరుతో పెద్ద ఎత్తున మద్దత్తు లభించిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో కౌశల్ ఆర్మీ సృటించిన బీభత్సం అంతా ఇంత కాదు. కౌశల్ కు పెరుగుతున్న మద్దత్తు చూసి సినీ వర్గాలు సైతం ఆశ్చర్యపోయాయి. బిగ్ బాస్2 ముగిసిన తరువాత కూడా కౌశల్ ఆర్మీ మరింత శక్తివంతంగా మారుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు, కౌశల్ ఆర్మీకి మధ్య సోషల్ మీడియా వార్ మొదలైంది.

    తుఫాను భాదితులకు సహాయం

    తుఫాను భాదితులకు సహాయం

    తిత్లీ తుఫాను బీభత్సంతో శ్రీకాకుళం జిల్లా అతలాకుతలంగా మారిన సంగతి తెలిసిందే. తుఫానుభాదితులకు కౌశల్ ఆర్మీ సహాయ సహకారాలు అందించింది. నిన్ననే ప్రభాస్ జన్మదిన వేడుకలు తెలుగు రాష్ట్రల్లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కౌశల్ ఆర్మీకి, ప్రభాస్ అభిమానులకు మధ్య వివాదం ఏర్పడి సోషల్ మీడియాలో పెద్ద రచ్చగా మారింది.

    ఆ గొడవకు కారణం

    ఆ గొడవకు కారణం

    ప్రభాస్ అభిమానుల కంటే కౌశల్ ఆర్మీ శక్తివంతమైనది అనే వాదన రావడంతో గొడవ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఈ వివాదం సోషల్ మీడియా వేదికగా తీవ్రమైన చర్చకు దారితీసింది. స్టార్ హీరోల అభిమానుల మధ్య వివాదాలు కొత్తేమి కాదు. తమ హీరో గొప్ప అంటే తమ హీరోనే గొప్ప అని తరచుగా అభిమానుల మధ్య వాదోపవాదాలు జరుగుతూ ఉంటాయి.

    కౌశల్ ఆర్మీని విస్తృతం చేయాలని

    కౌశల్ ఆర్మీని విస్తృతం చేయాలని

    బిగ్ బాస్ విజేత కౌశల్ తన ఆర్మీని మరింత విస్తృతం చేస్తానని ఇదివరకే ప్రకటించాడు. గతంలో కూడా కౌశల్ ఆర్మీ హీరో నానిపై ట్రోలింగ్ చేసిన సంగతి తెలిసిందే. కౌశల్ కు ఎవరు ఎదురెళ్ళినా వారిపై కౌశల్ ఆర్మీ ట్రోలింగ్ మొదలు పెడుతోందని అపవాదు ఉంది. అసభ్యంగా కామెంట్స్ చేసేవాళ్ళు కౌశల్ ఆర్మీలో భాగం కాదని కౌశల్ ఇదివరకే ప్రకటించాడు.

    ఏకపక్షంగా

    ఏకపక్షంగా

    కౌశల్ బిగ్ బాస్ 2 విజేతగా భారీ ఓటింగ్ తేడాతో విజయం సాధించాడు. ఈ ఏకపక్ష విజయం కౌశల్ ఆర్మీ వలనే సాధ్యం అయింది. బిగ్ బాస్ తరువాత కూడా కౌశల్ ఆర్మీ వివాదాల్లో భాగం కావడం చర్చనీయాంశంగా మారింది.

    English summary
    War between Kaushal Army and Prabhas fans. Here is the reason
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X