'చరిత్ర' చిచ్చు?: ముదిరిన మెగా-నందమూరి 'వైరం', ఎంతదాకా వెళ్లిందంటే?

Recommended Video

ముదిరిన మెగా-నందమూరి 'వైరం' ఒకరిపై ఒకరు దాడి !

మా హీరో ముందు ఏ హీరో అయినా దిగదుడుపే అనుకునే అభిమానులు చాలామంది ఉంటారు. హీరోలను దైవ సమానంగా భావిస్తారు. ఎవరైనా పల్తెత్తు మాట అన్నారంటే.. ఇక వాళ్లకు మూడినట్లే లెక్క. ఇక హీరోల్లో మావాడే నంబర్ వన్ అనే తరహా పేచీలు కూడా అభిమానుల్లో కామనే. ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి విడుదలయ్యాయంటే ఈ వైరం మరింత ముదరుతుంది. ఇప్పుడు మెగా-నందమూరి అభిమానుల మధ్య ఇలాంటి వైరమే రగులుతోంది.

ఫ్లెక్సీ ఫైట్..:

పవన్ కల్యాణ్ హీరోగా నటించిన 'అజ్ఞాతవాసి' సినిమా జనవరి 10న విడుదలైన సంగతి తెలిసిందే. సినిమా విడుదల సందర్భంగా అభిమానులు ప్రతీ థియేటర్ వద్ద పదుల సంఖ్యలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. విశాఖలోని ఓ థియేటర్ వద్ద పవన్ ఇమేజ్ ను ఆకాశానికెత్తేసే తరహాలో ఓ బ్యానర్ ఏర్పాటు చేశారు.

 ఏంటా ఫ్లెక్సీ?:

ఏంటా ఫ్లెక్సీ?:

'తాతల చరిత్ర చెప్పుకునే అలవాటు లేదు.. మేము సృష్టించే చరిత్రలే భావితరాలకు భగవద్గీత' అని పేర్కొంటూ థియేటర్ వద్ద కొంతమంది అభిమానులు ఓ బ్యానర్ ఏర్పాటు చేశారు. మెగా అభిమానులు చేసిన ఈ కామెంట్స్ పరోక్షంగా నందమూరి హీరోలపై సెటైర్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

 నందమూరి ఫ్యాన్స్ కౌంటర్:

నందమూరి ఫ్యాన్స్ కౌంటర్:

మెగా అభిమానులు వేసిన ఈ సెటైర్ కు బాలయ్య అభిమానుల నుంచి కూడా గట్టి కౌంటరే పడింది. నేడు జైసింహా విడుదల సందర్భంగా విశాఖలోని ఓ థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన బ్యానర్ ద్వారా మెగా అభిమానులకు వాళ్లు కౌంటర్ ఇచ్చారు.

 మీకేముందిరా చరిత్ర?:

మీకేముందిరా చరిత్ర?:

'మాకు నాన్న, తాత చరిత్ర ఉంది కాబట్టి చెప్పుకుంటున్నాము. మీకేముందిరా చెప్పుకోవడానికి చరిత్ర.. ఒక మహానీయుని గురించి చెప్పితే అది చరిత్ర అవుతుంది. అదే మీ చరిత్ర చెప్పితే భావి తరాలకు కాదు కదా.. బావిలో దూకడానికి కూడా పనికిరాదు' అంటూ నందమూరి అభిమానులు మెగా అభిమానులకు కౌంటర్ ఇచ్చారు.

ముదురుతోన్న వైరం:

ముదురుతోన్న వైరం:

'అజ్ఞాతవాసి', 'జైసింహా' సినిమాలు రెండు రోజుల వ్యవధిలో విడుదలవడంతో.. నందమూరి, మెగా అభిమానుల మధ్య 'వార్' నడుస్తోంది. శ్రీకాకుళంలోని పురుషోత్తమపురంలో పవన్ కల్యాణ్, నందమూరి బాలకృష్ణ అభిమానుల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారి తీసి చివరికి ఒకరిపై ఒకరు దాడిచేసుకునే వరకు వెళ్లింది.

 బాలయ్య ఫ్యాన్ దాడి:

బాలయ్య ఫ్యాన్ దాడి:

ఘర్షణ తారస్థాయికి చేరుకున్న దశలో బాలయ్య అభిమాని పవన్ అభిమానిపై బ్లేడుతో దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ మెగా-నందమూరి అభిమానుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X