twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కరోనా సమయంలో డిస్ట్రిబ్యూటర్ భారీ రిస్క్.. ఒకేసారి నాలుగు సినిమాల నైజాం రైట్స్!

    |

    కరోనా దెబ్బకు సినీ పరిశ్రమ భవిష్యత్తు చాలా క్లిష్టంగా మారింది. మళ్ళీ థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి అనే విషయంలో ఇంతవరకు ఎలాంటి క్లారిటీ లేదు. ఓకేవేళ ఓపెన్ అయినా కూడా జనాలు థియేటర్స్ వరకు వస్తారనే గ్యారెంటీ లేదు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో సినిమా బిజినెస్ కి చాలా దూరంగా ఉంటున్నారు చాలా మంది. కానీ ఒక డిస్ట్రిబ్యూటర్ మాత్రం ఏకంగా నాలుగు సినిమాల థియేట్రికల్ రైట్స్ ని దక్కించుకోవడం హాట్ టాపిక్ గా మారింది.

    ఒకేసారి నాలుగు సినిమాలు..

    ఒకేసారి నాలుగు సినిమాలు..

    టాలీవుడ్ లో దాదాపు అందరి నిర్మాతలతో మంచి పరిచాయలున్న వరంగల్ డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్ ఎంతో కాలంగా ఈ బిజినెస్ లో కొనసాగుతున్నాడు. అయితే డిస్ట్రిబ్యూటర్ అనే పదానికి చాలా మంది దూరమవుతున్న సమయంలో ఎవరు ఉహీంచని విధంగా ఒకేసారి నాలుగు సినిమాల థియేట్రికల్ హక్కులను మంచి డీల్స్ కి దక్కించుకోవడం వైరల్ అవుతోంది.

    భారీ ప్రయోగం..

    భారీ ప్రయోగం..

    ఆ సినిమాల విషయానికి వస్తే.. గోపిచంద్ సీటిమార్, రవితేజ క్రాక్ సినిమాలతో పాటు శర్వానంద్ శ్రీకారం, రానా సాయిపల్లవిల విరాటపర్వం సినిమాల నైజాం హక్కులను కూడా సొంతం చేసుకున్నారు. సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలియదు గాని ఒకేసారి భారీ ఎమౌంట్ తో సినిమా పంపిణీ హక్కులను దక్కించుకున్న శ్రీనివాస్ భారీ ప్రయోగమే చేస్తున్నాడని తెలుస్తోంది.

    కరోనా భయం..

    కరోనా భయం..

    కరోనా వైరస్ ధాటికి థియేటర్స్ పరిస్థితి ఎవరికి అంతు పట్టడం లేదు. ఇటీవల నిర్మాత సురేష్ బాబు కూడా చాలా అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు తాను సినిమాలు నిర్మిస్తానో లేదో అనే విధంగా కామెంట్ చేయడం అందరిని షాక్ కి గురి చేసింది. గతంలో ఎన్నో సినిమాను క్లిష్ట పరిస్థితుల్లో రిలీజ్ చేసిన వారు కూడా ఇప్పుడు చేతులెత్తేసే పరిస్థితి ఏర్పడింది.

    పాజిటివ్ వైబ్రేషన్స్..

    పాజిటివ్ వైబ్రేషన్స్..

    ఇక వరంగల్ శ్రీనివాస్ మాత్రం మంచి డీల్స్ కి ఒకేసారి నాలుగు సినిమాల థియేట్రికల్ రైట్స్ అందుకోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ నాలుగు సినిమాలపై కూడా ఆడియేన్స్ లో పాజిటివ్ అంచనాలు ఉన్నాయని చెప్పవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలిస్తే అత్యంత బిజినెస్ ఉన్న ఏరియా నైజాం. ఎలాంటి సినిమాలైనా మినిమమ్ వసూళ్లను అందుకుంటాయి. మరి శ్రీనివాస్ వాటితో ఎంతవరకు లాభాలు అందుకుంటారో చూడాలి.

    English summary
    Popular Tollywood distributor Warangal Srinivas has acquired the Nizam theatrical rights of 4 much-awaited movies. Ravi Teja’s Krack, Gopichand’s Seetimaarr, Sharwanand’s Sreekaram and Rana’s Virata Parvam are the four crazy films Srinivas acquired.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X