రామ్ గోపాల్ వర్మ కు కాపు సంఘం వార్నింగ్
బెజవాడ సినిమాకు వ్యతిరేకంగా ఏలూరులో కాపు సంఘాల ఆధ్వర్యంలో రంగా అభిమానులు ఆందోళనకు దిగారు.మోహన్ రంగాను రౌడీగా చూపిస్తున్నారంటూ వారు సీ ఆర్ రెడ్డి కాలేజి వద్ద ధర్నాకు దిగారు.రంగా విగ్రహానికి పాలాభిషేకం చేసి పూల మాలలు వేసారు. రామ్ గోపాల్ వర్మ కు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. ఈ సినిమాని ప్రదర్సిస్తే..ఆ ధియోటర్స్ మూసి వేయిస్తామని రంగా మిత్ర మండిలి నాయకులు హెచ్చరించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ...రామ్ గోపాల్ వర్మ పిచ్చి పట్టిన ధోరిణితో తీసిన బెజవాడ చిత్రంలో రంగా గారిని ఏ మాత్రం తక్కువ చేసిన చూపించినా ఆందోళన చేపడతామని అన్నారు.మరి ఆ సినిమా ఆడనివ్వకుండా ధియోటర్స్ ఆడనివ్వకుండా ఉండటానకి చర్యలు తీసుకుంటామన్నారు. కబడ్దార్ రామ్ గోపాల్ వర్మా అంటూ హెచ్చరించారు.
అయితే వర్మ మాత్రం వీటిని లెక్క చేసేటట్లు కనపడటం లేదు. ఆయన మాట్లాడుతూ....ఇది ఫిక్షనల్ స్టోరీ.'బెజవాడ' అనే టైటిల్ పడింది మొదలు ఫస్ట్ షాట్ నుంచి లాస్ట్ షాట్ వరకు ఎప్పుడు జరిగింది, ఎందుకు జరిగింది అనేది ఇందులో చర్చించడానికి అవకాశం ఉండదు. అంత గ్రిప్పింగ్‌గా సినిమా ఉంటుంది.అలాగే 'బెజవాడ'లో ఉండే రెండు వర్గాలకు సంబంధించిన కథా కాదు.భగవంతుడి సాక్షిగా... 'బెజవాడ' కేవలం కల్పిత కథ. ఎవరిని ఉద్దేశించి తీసింది కాదు అన్నారు.దర్సకుడు వివేక్ కృష్ణ సైతం ...''బెజవాడ అనేది ఓ ఊరి పేరు మాత్రమే. అక్కడి రాజకీయాలకూ మా సినిమా కథకూ ఏ మాత్రం సంబంధం లేదు. కానీ సన్నివేశాలన్నీ వాస్తవ ప్రపంచానికి అద్దంపడతాయంటూ బెజవాడ చిత్రం అన్నారు.డిసెంబర్ ఒకటవ తేదీన ఈ చిత్రం విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











