twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వక్రీకరించవద్దంటూ తారకరత్నకు హెచ్చరిక

    By Srikanya
    |

    హైదరాబాద్ : నందమూరి తారకరత్న, అర్చన జంటగా నటిస్తున్న 'మహాభక్త సిరియాళ' చిత్రం షూటింగ్ ఆదివారం సారథీ స్టూడియోస్‌లో ప్రారంభమైంది. ఈ చిత్రం చాలా జాగ్రత్తగా తీయాలని,భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా చూడాలని వీరశైవులు కోరుతునవ్నారు. వీరశైవుల మనోభావాలు దెబ్బతినకుండా 'భక్త సిరియాళ' చిత్రాన్ని రూపొందించాలని వీరశైవ ధర్మ ప్రచార సంఘం రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షులు జగదేవ్‌ హీరేమఠ్‌, నేతి జ్ఞానేశ్వర్‌లు ఒక ప్రకటనలో కోరారు.

    వీరశైవ ధర్మం, సంప్రదాయానికి ప్రతీకైన భక్త సిరియాళ చిత్రాన్ని చరిత్రలోని వాస్తవ కథకు అనుగుణంగా చిత్రీకరించాలని పేర్కొన్నారు. 1978 లో తీసిన ఈ సినిమా కన్నడలో వీరశైవ లింగాయత్‌ల ఆదరణను చూరగొందని పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా తెలుగు చిత్రాన్ని నిర్మించాలన్నారు. భక్తిరస చిత్రాలను వాణిజ్యపరంగా వక్రీకరించి చిత్రీకరించడం తగదని హెచ్చరించారు . వి.వి.ఆర్. ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా ప్రై. లిమిటెడ్ పతాకంపై వల్లభనేని వెంకటేశ్వరరావు నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా ముద్దపు రాంబాబు దర్శకునిగా పరిచయమవుతున్నారు.

    తారకరత్న మాట్లాడుతూ "ఇది నేను నటిస్తున్న తొలి భక్తి చిత్రం. వీర శైవుడు సిరియాళునిగా నటిస్తుండటం సంతోషంగా ఉంది'' అన్నారు. దర్శకుడు రాంబాబు మాట్లాడుతూ "భక్తునికీ, భగవంతునికీ మధ్య జరిగే చర్చ ఈ చిత్రం. ఇరవై నిమిషాల గ్రాఫిక్ వర్క్ ఉంటుంది'' అని చెప్పారు. 'శ్రీరామదాసు'లో చేసిన సీత పాత్ర ఎంతో పేరు తెచ్చిందనీ, మళ్లీ తన మనసుకు ఇందులోని పాత్ర నచ్చిందనీ అర్చన తెలిపారు. నిర్మాత వెంకటేశ్వరరావు మాట్లాడుతూ "ఇప్పటి తరానికి తగ్గట్లు సిరియాళుని కథలో మార్పులు చేసి ఈ సినిమా నిర్మిస్తున్నాం. హిందూత్వాన్ని అభిమానించే వారంతా ఈ సినిమాని ఇష్టపడతారు'' అన్నారు.

    సిరియాళుడు గొప్ప శివభక్తుడు. భగవం తునికి... భక్తునికి నిరంతరం అనుసం ధానమైన పరీక్షలు జరుగుతూనే ఉం టాయి. నిరంతరం పరమేశ్వరుని ధ్యానంతో తన జీవితాన్ని పునీ తం చేసుకున్న మహా భాగ్యశాలి సిరియాళుడు ఆ పరమేశ్వరుని కఠిన పరీక్షలలో నెగ్గి తన భక్తిని నిరూపించుకున్న వెైనం ఎంతో గొప్పగా ఉంటుంది. అటువంటి భక్తి నేపథ్యంలో భగవంతుని కన్నా...భక్తే గొప్పదని నిరూపించే భక్తిరస ప్రధాన చిత్రంలో ప్రధాన పాత్రను పోషించనున్నారు.

    నారాయణరావు, నాగినీడు, కన్నడ శ్రీధర్, సుబ్బరాయశర్మ, ప్రసన్నకుమార్, రంగనాథ్, హేమసుందర్, హరి, మాస్టర్ విజయ్, శివపార్వతి, భావన, దేవిశ్రీ, సోని, అనూరాధ తారాగణమైన ఈ చిత్రానికి మాటలు: పరాంకుశం భవానీప్రసాద్, పాటలు: రామజోగయ్యశాస్త్రి, అనంతశ్రీరామ్, చైతన్యప్రసాద్, పూర్ణచంద్, సంగీతం: మంగళగిరి పూర్ణచంద్, ఛాయాగ్రహణం: శ్రీవెంకట్, కూర్పు: నందమూరి హరి, కళ: భాస్కర్, సహ నిర్మాత: ఎం.ఎల్.కె.డి. ప్రసాద్.

    English summary
    Hero Taraka Rathna is going to play as Bhaktha Siriyala a story of lord Shiva’s devotee in his forthcoming movie directed by Muddapu Ram Babu. The dialogues were penned by Parankusham Bhavani Prasad for the movie. Actors Archana, Nagineedu, Narayana Rao, Kannada Sridhar and others were also playing in lead roles in the movie. The music is scored by Dr.Mangalagiri Purnachand and Lyrics by Chitanya Prasad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X